
-ఎందుకు ఆ హీరో, హీరోయిన్ చనిపోయారు
-మరో హీరోయిన్ నిద్రమాత్రలు మింగింది
-కారణాలు ఏంటి!
-ఇంతకీ ఆ సినిమా ఏంటి
సినిమా..అలసిపోయిన మనిషి శరీరానికి, మెదడుకి సరికొత్త నూతనోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు టన్నుల క్యాలరీల కొద్దీ శక్తి ఇస్తుంది. ఆ శక్తి మనిషికి సరికొత్త జన్మని ప్రసాదించినట్టే అవుతుందనే నానుడి కూడా ఎప్పట్నుంచో ఉంది. మూవీ లవర్స్ కి ఆ ఈక్వెషన్ గురించి బాగా తెలుసు. కాకపోతే పైన చెప్పుకున్నవన్నీ మనకి దక్కడానికి 24 క్రాఫ్ట్స్ పడే కష్టం మన ఊహకి కూడా అందదు .ముఖ్యంగా హీరో, హీరోయిన్ తమ అభిమాన గణాన్ని అలరించాలనే ఉద్దేశ్యంలో నిద్రాహారాలు మాని సినిమా బాగా రావడం కోసం కష్టపడతారు.అలాంటి ఒక సినిమా అభిమానులకి చేదు జ్ఞాపకం మిగిల్చింది. ఆ సినిమాలో చేసిన హీరో ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతే హీరోయిన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మరో హీరోయిన్ కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూద్దాం.
కలుసుకోవాలని(Kalusukovalani).. 2002 ఫిబ్రవరి 8 న థియేటర్స్ లో అడుగుపెట్టింది. అంటే నిన్నటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఉదయ్ కిరణ్(ఉదయ్ కిరణ్), గజాల(గజాల), ప్రత్యూష(ప్రత్యూష)జంటగా చెయ్యగా రఘురాజ్(రఘురాజ్) దర్శకత్వంలో దిల్ రాజు, గిరి, ప్రవీణ్ నిర్మించారు. రొమాంటిక్ కామెడీ గా పరిచయమైన కలుసుకోవాలని మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత ఉదయ్ కిరణ్ నుంచి వచ్చిన మూవీ. ఈ చిత్రం కూడా గత చిత్రాల లాగానే ఘన విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు అతి పెద్ద అసెట్. 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. బయట రకరకాల కారణాలు వినిపిస్తున్నా అసలు విషయం ఆత్మ హత్య చేసుకున్న ఉదయ్ కిరణ్ కే తెలియాలి.
ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ సినిమా పరిస్థితి ఏంటి.. అనిల్ రావిపూడితో చేస్తే ఎలా ఉంటుంది!
ప్రత్యూష కలుసుకోవాలని వచ్చిన రెండు వారాలకే మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. మరో హీరోయిన్ గజాల కూడా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. సరైన సమయానికి ఆమె స్నేహితులు వచ్చి కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ విధంగా కలుసుకోవాలని మూవీ ఇప్పుడు వైరల్ గా మారింది. వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న మనసంతా నువ్వే రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఉదయ్ కిరణ్ సినిమాల గురించి ప్రస్తావనకు రావడం కూడా ఒక కారణం.

