ఈ వారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 వరకు ఓటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాల్లో సంక్రాంతికి థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ ఉంది. బాక్సాఫీస్ వద్ద 375 కోట్లకుపైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా జీ5 వేదికగా ఫిబ్రవరి 11 నుండి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ.. ఇలా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అకౌంట్. సంక్రాంతి రేసులో నిలిచిన మరో సినిమా ‘అనగనగా ఒకరాజు’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతోపాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో ‘నారీ నారీ నడుమ మురారి’, జియో హాట్ స్టార్‌లో ‘ది రాజా సాబ్’ చిత్రాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఇవిలా ఉంటే.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ సినిమా నేరుగా ఓటీటీలో ఫిబ్రవరి 12 నుంచి విన్ వేదికగా ప్రసారం కానుంది. ఈ సినిమాలో లయ, శివాజీ మళ్లీ జంటగా కనిపిస్తారు. అలాగే మలయాళీ మెడికో థ్రిల్లర్ ‘బేబీ గర్ల్’ ఫిబ్రవరి 12 నుంచి ప్రేక్షకులను అలరించనుంది.
జియో హాట్ స్టార్‌లో నివిన్ పౌలి హీరోగా నటించిన ‘సర్వం మాయ’ సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మంజుమల్ బాయ్స్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సౌబీన్ షాహీర్ ‘పతి రాత్రి’ సినిమా కూడా ఫిబ్రవరి 13 నుండి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ సంస్థ. మలయాళ చిత్రం ‘నీలకంఠ’ సన్ నెక్స్‌ట్‌లో ఈ వారం నుంచి స్ట్రీమ్ అవుతుంది. వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే ‘ది కంజూరింగ్: లాస్ట్ నైట్స్’ జియో హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 13నుంచి, ఇటాలియన్ సిరీస్ ‘మోటార్ వ్యాలీ’ నెట్ ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 10 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.

CEO
Mslive 99news
Cell : 9963185599
