Home సినిమా ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం.. రీజన్ ఇదే – Swen Daily

ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం.. రీజన్ ఇదే – Swen Daily

by
0 comment
ఏడేళ్ల పాటు మంచానికే పరిమితం.. రీజన్ ఇదే
2,803 Views




-ముమైత్ ఖాన్ ఏం చెప్తుంది
-ఎందుకు తనకి ఆ ప్రాబ్లమ్
-చివరగా ఎప్పుడు కనపడింది

సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు),పూరి జగన్నాధ్(పూరి జగన్నాధ్)ల పోకిరిలోని ‘ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారే సాంగ్’ కి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండకపోవచ్చు. అంతలా సదరు సాంగ్ కి అభిమానులు,ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. సదరు కనెక్ట్ అడిక్ట్ గా మారడానికి ‘ముమైత్ ఖాన్'(ముమైత్ ఖాన్)కూడా ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా సదరు సాంగ్ లో డాన్స్ తో మెస్మరైజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan)మగధీర లోని ‘బంగారు కోడిపెట్ట సాంగ్’ లో కూడా సూపర్ గా స్టెప్స్ వేసి తన స్థాయిని పెంచుకొని సోలో హీరోయిన్ స్థాయికి ఎదిగింది. కానీ గత కొంత కాలం నుంచి సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉంటున్న మమైత్ ఖాన్’ అందుకు గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించింది.

ముమైత్ ఖాన్ మాట్లాడుతు పదమూడు సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఒక ప్రమాదం కారణంగా మెదడులోని నరాలకి దెబ్బ తగిలింది.దాంతో కనీసం ఏడేళ్ల పాటు కదలకూడదని బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదని వైద్యులు చెప్పారు. దాంతో మంచానికే పరిమితమయ్యాను. మందులు కూడా వాడటంతో లావు అయ్యాను. విరామం తీసుకోవడానికే దేవుడు ఇలా చేసాడని అనుకున్నాను కానీ ఏ మాత్రం బాధపడలేదని ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది.


ఇది కూడా చదవండి: జియో హాట్ స్టార్ ఆఫీస్ కి ఊహించని పార్సిల్.. రాజా సాబ్ స్ట్రీమింగ్ నే కారణం

2004లో నందమూరి హరికృష్ణ, మీనా కాంబోలో వచ్చిన స్వామి మూవీలో క్యామియో రోల్ తో తెలుగు సినీ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ పోకిరి తోనే స్పెషల్ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. తెలుగుతో పాటు హిందీ,తమిళ, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్, క్యామియా రోల్స్, ప్రధాన క్యారక్టర్ లు కలుపుకొని సుమారు వంద సినిమాల వరకు చేసింది. తెలుగులో చివరిగా 2019 లో వచ్చిన ఆర్ డి ఎక్స్ లవ్ లో కనపడగా మళ్ళీ తన ప్రభావం చాటుతుందేమో చూడాలి.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird