Home సినిమా మాధవన్:మాధవన్ ని ఇంటి నుంచి గెంటేసిన భార్య.. మొన్ననే పద్మశ్రీ కూడా కనిపించింది – MS Live 99 News

మాధవన్:మాధవన్ ని ఇంటి నుంచి గెంటేసిన భార్య.. మొన్ననే పద్మశ్రీ కూడా కనిపించింది – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
మాధవన్:మాధవన్ ని ఇంటి నుంచి గెంటేసిన భార్య.. మొన్ననే పద్మశ్రీ కూడా కనిపించింది
2,805 Views



-ఇంటి నుంచి గెంటి వెయ్యవల్సిన పరిస్థితి ఏంటి
-మాధవన్ కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది
-అసలు మాధవన్ చేసిన నేరం ఏంటి
-ఆ ఇద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగింది

ఆర్ మాధవన్(R Madhavan)ఈ పేరుకి సిల్వర్ స్క్రీన్ కి, సినీ ప్రియులకి ఉన్న అనుబంధం రెండున్నర దశాబ్దాలపైనే. అంతలా హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పిస్తూ వస్తున్నాడు. మెప్పిస్తుండటమే కాదు తన చరిష్మా కి సంబంధించి ఎక్స్ పైరీ డేట్ కి నో ఛాన్స్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఇండియన్ సినిమా గొప్పతనాన్ని చాటుతూ 1300 కోట్ల క్లబ్‌లోకి చేరిన ధురంధర్(ధురంధర్)లో ఐబీ ఆఫీసర్ అజయ్ సన్యాల్ గా ప్రేక్షకులు ధురంధర్ లో లీనమయ్యేలా చేసాడు. రియల్ గా మన దేశపు ఎన్ ఎస్ ఏ ఆఫీసర్ అజిత్ దోవల్ అనే నిజమైన క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసి మాధవన్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది ప్రేక్షకులు కూడా అనేలా చేసాడు. అలాంటి మాధవన్ ని భార్య ఇంట్లో నుంచి పంపించేసిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

మాధవన్ రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అప్పుడు నా భార్య నాతో మాట్లాడుతుంది నువ్వెప్పుడూ ఖాళీగా ఇంట్లోనే కూర్చోకుండా సినిమాలు, ఓటిటి ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉంటావు. కానీ ఇప్పుడు బయటకి వెళ్లినా త్వరగా వచ్చేస్తున్నావు.గతంలో ఉన్నంత ఉత్సాహం నీలో కనిపించడం లేదు. అసలు నువ్వు బాగానే ఉన్నావా! లేదా! ఎప్పటిలాగానే బయటకి వెళ్లి డబ్బు సంపాదించు అని మా ఆవిడ చెప్పింది. ఆ మాటలు నాలో ఆలోచనలు కలిగించడంతో పాటు నాపై ఎంతో ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే ఇంటర్వ్యూ లో టోటల్ గా అవే మాటల సారాంశం ఉన్నా’నా భార్య కోవిడ్ సమయంలో డబ్బు సంపాదించమని ఇంట్లో నుంచి గెంటివేసిందని సరదాగా చెప్పడంతో మాటలు వైరల్ గా నిలిచాయి.

ఇది కూడా చదవండి: 25 రోజులకి గాను ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. బుక్ మై షో నే సాక్ష్యం

మాధవన్ వైఫ్ పేరు సరితా బిర్జే(సరితా బిర్జే).. 1999లో ఆ వివాహం జరగనుండడంతో ఫిలిం ఇన్‌వెస్ట్‌లో కోచింగ్ తీసుకున్నాడు.పెళ్లి తర్వాతనే మాధవన్ లెజండ్రీ మేకర్ మణిరత్నం డైరెక్షన్‌లో సఖి మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. జార్ఖండ్ కి చెందిన మాధవన్ కి అదే తొలి చిత్రం. ఇక అక్కడనుంచి తన ప్రభావం చాటుతూ వస్తున్నాడు. ఇటివల 2026 కి సంబంధించి ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి మాధవన్ ఎంపికైన విషయం తెలిసిందే. ఎంపిక కావడం కంటే పద్మశ్రీ నే వెతుక్కుంటూ వచ్చిందని చెప్పవచ్చు. అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే ధురంధర్ పార్ట్ 2(ధురంధర్ 2)తో ఈసారి పాకిస్థాన్ లో జరపబోయే తన ఆపరేషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మార్చి 19న తెలియబోతుంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird