Home సినిమా ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు – Swen Daily

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు – Swen Daily

by
0 comment
ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు
2,801 Views




-థియేటర్స్ లో సక్సెస్ ని రాబట్టిన శంబాల
-మరి ఓటిటి పరిస్థితి ఏంటి
-జనవరి 22 న అడుగుపెట్టింది కదా
-ఓటిటి సినీ ప్రియులు ఏమంటున్నారు



కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకుంది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం.

జనవరి 22 నుండి నిన్న ఫిబ్రవరి 1 st కి శంబాల అడుగుపెట్టి పదకొండు రోజులు. ఈ పదకొండు రోజులకే 100 మిలియన్ల రికార్డు వ్యూస్ ని రాబట్టింది. ఇది ఆషామాషీ రికార్డు కాదు. ఆది సాయికుమార్(Aadi Saikumar) 2013 లో చేసిన సుకుమారుడు దగ్గరనుంచి సుమారు పద్దెనిమిది చేసాడు. మోస్ట్ లీ అన్ని డిజాస్టర్స్ నే. అంటే పదకొండేళ్ల పాటు నో హిట్. కానీ శంబాల తో టాప్ హీరో రేంజ్ లో పదకొండు రోజులకే 100 మిలియన్ల వ్యూస్ ని సాధించాడు. సదరు రికార్డుని ఆహా యాజమాన్యం అధికారకంగా మరోసారి పోస్టర్ రిలీజ్ చేసింది. వీరి రికార్డు పై సోషల్ మీడియా వేదికగా శంబాల అభిమానులు వ్యతిరేకంగా ‘ఇంతటితో ఆగిపోలేదు. శంబాల ఆహా లో ఉన్నంత కాలం రికార్డులు గురించి వింటూనే ఉంటామనే కామెంట్స్ చేస్తున్నారు.


ఇది కూడా చదవండి: కవలలు పుడితే ఎందుకు అంత హడావిడి!

మైస్టికల్ వరల్డ్ జోనర్ కి హర్రర్ థ్రిల్లర్ ని జోడించి శంబాల రూపొందించబడింది. ఈ జోనర్ లో సబ్జెట్ ని ప్రదర్శించి మెప్పించడం చాలా కష్టం. పైగా టాప్ యాక్టర్స్ ఎవరు లేరు. కానీ ఈ రెండు విషయాల్లో దర్శకుడు యుగంధర్ ముని (ఉగంధర్ ముని)సక్సెస్ అయ్యాడు. మూవీ చూస్తున్నంత సేపు క్యారెక్టర్స్ మాత్రమే కనపడతాయి. రెప్ప వాల్చకుండా శంబాల లోకానికి సరెండ్. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణ. మరి మీరు కూడా శంబాల చూసి ఆనందించండి.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird