.webp)
వారణాసి విడుదల తేదీ ప్రకటన
‘పోకిరి’, ‘బాహుబలి-2’ రిజల్ట్ రిపీట్ అవుతుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు(మహేష్ బాబు), దర్శకధీరుడు రాజమౌళి(రాజమౌళి) కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ‘వారణాసి’ (వారణాసి). కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఈ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.
‘వారణాసి’ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లోనే ఈ 2027 వేసవిలో విడుదల చేసింది. అయితే భారీ సినిమా, అందునా రాజమౌళి సినిమా కావడంతో.. ఆ టైంకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్న సడెన్ గా సినిమా పేరు లేకుండా “2027 ఏప్రిల్ 7న విడుదల” అంటూ వారణాసిలో కొన్ని పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇది వారణాసి మూవీ విడుదల తేదీనే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తాజాగా రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు మేకర్స్. 202 ఏప్రిల్ 7న విడుదల చేయడాన్ని తెలుపుతూ ఒక పోస్టర్ ను వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
.webp)
ఇదిలా ఉంటే ఏప్రిల్ అనేది మహేష్, రాజమౌళి ఇద్దరికీ సెంటిమెంటే. మహేష్ నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ‘పోకిరి’, రాజమౌళి డైరెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ‘బాహుబలి-2’ ఏప్రిల్ లోనే విడుదలయ్యాయి. ‘వారణాసి’ కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి: సిరై మూవీ రివ్యూ

CEO
Mslive 99news
Cell : 9963185599
