
-హైకోర్టు ఏం చెప్తుంది
-అసలు అకిరా నందన్ హై కోర్టు కి ఎందుకు వెళ్ళాడు!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)నట వారసుడు ‘అకిర నందన్'(అకిరా నందన్)సిని రంగ ప్రవేశం చెయ్యాలనేది అభిమానుల ఆశ. వాళ్ళ ఆశలకి తగ్గట్టే అకిరా సినీ ఎంట్రీ గ్యారంటీగా ఉంటుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. దీంతో అకిరా గ్రాండ్ ఎంట్రీపై అభిమానులు పలు రకాలుగా ఊహించుకుంటూ వస్తున్నారు. కానీ కొన్ని రోజులుగా అకిరా యాక్ట్ చేసినట్టుగా చెప్తున్న ‘ఏ ఐ లవ్ స్టోరీ'(ఐ లవ్ స్టోరీ)అనే చిత్రం తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.
చాలా మంది అకిరా నుంచి వచ్చిన ఫస్ట్ మూవీగా భావించారు. కానీ అకిరా ఆ చిత్రంలో చెయ్యలేదు. టెక్నాలజీ ని ఉపయోగించి అకిరా పేస్, గొంతుని మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో ఉంచారు. ఈ విషయం తెలియగానే ఫ్యాన్స్ షాక్ అవ్వడం కూడా జరిగింది. దీంతో అకిరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి సదరు ఏఐ లవ్ స్టోరీ పై తన ప్రమేయం లేదని విన్నవించుకోవడం జరిగింది.
ఈ మొత్తం విషయంపై రీసెంట్ గా హైకోర్టు సూచన ‘ఐ లవ్ స్టోరీ’ సోషల్ మీడియా సంస్థ యూ ట్యూబ్ నుంచి వెంటనే తొలగించాలి. భవిష్యత్తులో అయినా అకిరా నందన్ అనుమతి లేకుండా అతని పేరు,ఫోటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏఐ లేదా డీప్ కంటెంట్ తయారు చేయకూడదని హైకోర్ట్ తన తీర్పుని ప్రకటించింది. దీంతో అకిరా తో పాటు అభిమానులకి పెద్ద రిలీఫ్ వచ్చింది.
ఇది కూడా చదవండి: ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్.. ఇండస్ట్రీ ని ఏలుతావా!
అకిరా పేరుతో యూ ట్యూబ్, ఫేస్ బుక్, ఇనిస్టా, ఎక్స్ లలో ఉన్న నకిలీ ప్రొఫైల్స్ పేజీలని కూడా తొలగించడానికి అకిరా మరో అభర్ధనని కూడా హైకోర్టు యాక్సెప్ట్ చేసి తగట్టుగా తీర్పు వెల్లడి చేసింది.

CEO
Mslive 99news
Cell : 9963185599
