
-తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
-మన శంకర వర ప్రసాద్ కి కలిసి వస్తుందా!
-మెగా, విక్టరీ మ్యానియా మొదలు
సెల్యులాయిడ్ పై మెగాస్టార్ చిరంజీవి(చిరంజీవి)మ్యానియాని మరోసారి వీక్షించడానికి మన శంకర వర ప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)ద్వారా కౌంట్ డౌన్ మొదలయ్యింది. ప్రచార చిత్రాలతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి(అనిల్ రావిపూడి)చెప్తున్న మాటల ద్వారా సరికొత్తగా చిరంజీవిని చూడబోతున్నామని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.విక్టరీ వెంకటేష్(వెంకటేష్)కూడా యాడ్ కావడంతో రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏరియాకి సంబంధించిన బుకింగ్స్ ఓపెనింగ్ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ టికెట్స్ రేట్లు పెంపు, బెనిఫిట్ షో కి సంబంధించిన రేట్లు ఏ విధంగా ఉండాలో తెలంగాణ ప్రభుత్వం(తెలంగాణ ప్రభుత్వం)కొద్దీ సేపటి క్రితమే జీవో జారీ చేసింది.
ఇది కూడా చదవండి: షాద్‌నగర్ నుంచి తిరుమలకి బండ్ల గణేష్ మహా పాదయాత్ర.. హీరో ఫాన్స్ ఏమంటున్నారు
ఈ జీవో ప్రకారంఈనెల 11న ప్రీమియర్ షోలు పడుతున్నాయి. టికెట్ రేట్ 600. అదే విధంగా వారంరోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో GSTతో కలిపి 50 రూపాయలు మల్టీప్లెక్సుల్లో 100 రూపాయలు ప్రస్తుతం ఉన్న రేట్లు కి యాడ్ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు కి సంబంధించి బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపుకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

CEO
Mslive 99news
Cell : 9963185599
