Home సినిమా 52 ఏళ్ళు అయితే 20 లా ఎలా కనిపిస్తున్నావో అర్ధమయ్యింది..ఆ ఐదు ఫాలో అవుతాం – Swen Daily

52 ఏళ్ళు అయితే 20 లా ఎలా కనిపిస్తున్నావో అర్ధమయ్యింది..ఆ ఐదు ఫాలో అవుతాం – Swen Daily

by
0 comment
52 ఏళ్ళు అయితే 20 లా ఎలా కనిపిస్తున్నావో అర్ధమయ్యింది..ఆ ఐదు ఫాలో అవుతాం
2,804 Views



-బయటపడిన మలైకా అరోరా అందం సీక్రెట్
-సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఏముంది
-అభిమానులు, నెటిజన్స్ స్పందన ఏంటి

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్'(పవన్ కళ్యాణ్)హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్’లోని కెవ్వు కేక సాంగ్ ఎంత పాపులరో తెలుస్తుంది. ఈ సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్స్ చేయడం ద్వారా తెలుగు నాట మంచి పాపులరిటీ ని సంపాదించిన భామ మలైకా అరోరా(మలైకా అరోరా). హిందీ చిత్ర రంగానికి చెందిన మలైకా సుదీర్గ కాలం నుంచి హిందీ చిత్ర రంగంలో తన సత్తా చాటుతుంది. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ మాజీ వైఫ్ కూడా అయిన మలైకా రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఐదు రకాల యోగా ప్రక్రియల గురించి వివరించింది.

1 .అనులోమ విలోమ.. ఒక ముక్కు రంధ్రంతో గాలి పీల్చి మరో రంధ్రం ద్వారా వదలడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు నాడీ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. తద్వారా ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.

2 . కపాలభాతి : ఈ ప్రక్రియ ద్వారా వేగంగా శ్వాస బయటకు వదలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట భాగంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఫలితంగా చర్మాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా బాడీని టోండ్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

3. భ్రమరి ప్రాణాయామం: గాలిని వదిలేటప్పుడు తుమ్మెద లాగా శబ్దం చేసే ఈ ప్రక్రియ మెదడుని ప్రశాంతపరుస్తుంది. దీనివల్ల వయసు పెరిగినా ఆ ప్రభావం ముఖంపై కనిపించదు. ఆందోళనను తగ్గించడంతో పాటు హార్మోన్ల భర్తీని కూడా కాపాడుతుంది..మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

4. భస్త్రిక : లోతుగా గాలి పీల్చుకోవడం వల్ల శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ అందుతుంది.
దాంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి ఈ ప్రాణాయామం.

5. ఉజ్జాయి ప్రాణాయామం: లోతుగా గాలి పీల్చి ఓం అని ఉచ్చరించడం వల్ల కలిగే ప్రకంపనలు మానసిక ప్రశాంతతని ఇస్తాయి. ఇది శ్వాసపై నియంత్రణను పెంచి, భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏభై సంవత్సరాల వయసులో కూడా మీరు ఇరవై ఏళ్ళ అమ్మాయిల కనపడటానికి సీక్రెట్ ఏంటో ఇప్పుడు అర్థమైందని, మేము కూడా వాటిని ఫాలో అవుతామని మెసేజెస్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird