
ఈమెనే టబు కూతురు
స్వయంగా పరిచయం చేసిన టబు
మరి పెళ్లి కానీ టబుకి కూతురు ఎక్కడ్నుంచి వచ్చింది
అసలు ఇంతకీ ఆమె ఎవరు
మీడియాతో సహా అందరు షాక్
టబు(టబు)..ఈ పేరు చెబితే తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(నాగరుజున)తో చేసిన ‘నిన్నే పెళ్లాడతా’లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తూ దూసుకుపోతుంది. టబు ఇంకా పెళ్లి చేసుకొని విషయం తెలుస్తుంది. కానీ ఇప్పుడు టబు తన కూతురుని పరిచయం చేయడం వల్ల అందర్నీ షాక్ కి గురి చేస్తుంది.
ఈ నెల 1 న న్యూ ఇయర్ వెల్ కమ్ చెప్తు బాలీవుడ్ లో ‘ఇక్కీస్'(ఇక్కిస్)అనే మూవీ రిలీజయ్యింది. దేశ భక్తి నేపథ్యంతో మంచి టాక్ తోనే రన్ అవుతుంది. రీసెంట్ గా ఇక్కీస్ స్పెషల్ షో ని సినీ సెలబ్రటీస్ కోసం ముంబై వేదికగా మేకర్స్ ప్రదర్శించారు. ఈ షో కి టబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మీకు నా కూతురుని పరిచయం చేస్తానని చెప్పగానే అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. టబు కూతురు ఎవరా అని ఒకింత ఉద్వేగంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి ప్రముఖ హీరోయిన్ ఫాతిమా సనా(Fathima Sana)వచ్చింది. టబు ఆమెని కౌగలించుకొని ఈమెనే నా కూతురు అని చెప్పింది. అప్పటికి కూడా అందరు షాక్ లో ఉన్నారు.
కూడా చదవండి: అఖండ 2 ఓటిటి డేట్ ఇదేనా!
ఆ తర్వాత టబు మాట్లాడుతుంది 1997 వ సంవత్సరంలో ‘చాచి 420’మూవీలో ఫాతిమా నా కూతురిగా చేసింది. అప్పట్నుంచి ఫాతిమా నా కూతురే అని టబు చెప్పేసరికి మీడియా తో పాటు అక్కడున్న వాళ్ళందరు నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో సోషల్ మీడియా వేదికగా టబు అభిమానులు త్వరగా తెలియజేస్తారు టబు మేడం మీరు పెళ్లి చేసుకొని నిజమైన కూతుర్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నారు. ఇక దంగల్ తో ఫాతిమా ఇండియా వైడ్ గా ఫుల్ పాపులారిటీ సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో ఉంది.


CEO
Mslive 99news
Cell : 9963185599
