సర్పంచ్ నిర్మల మోహన్ రెడ్డి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

పేరువంచ గ్రామ హై స్కూల్‌లో విద్యార్థుల సదుపాయాలపై అధికారులు సమగ్రంగా పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ, ఎంఈఓలు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం గ్రామ సర్పంచ్ కీసర నిర్మల మోహన్ రెడ్డి గారు విద్యార్థులతో నేరుగా మాట్లాడి,వారి అవసరాలు, సమస్యలు, భోజన నాణ్యత, విద్యా సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సర్పంచ్ భరోసా ఇచ్చారు.
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఎంఆర్ఓ, ఎంఈఓలు స్వయంగా పరిశీలించి టెస్ట్ చేయడం విశేషం.భోజనం నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిని కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కీసర మోహన్ రెడ్డి ,పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, వార్డు మెంబర్, గ్రామ బీసీ అధ్యక్షులు బడుగు వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
గ్రామంలో విద్యా అభివృద్ధికి సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను పలువురు అభినందించారు.

CEO
Mslive 99news
Cell : 9963185599
