Home సినిమా జన నాయకుని రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు – MS Live 99 News

జన నాయకుని రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
జన నాయకుని రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు
2,806 Views




-ఏంటి ఆ రికార్డు
-జన నాయకన్ పై భారీ అంచనాలు
-అభిమానులు ఎంత మంది
-మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు చేసుకుంది

రికార్డులకి కొత్త పేర్లు వెతికే పనిని కోలీవుడ్ సినీ విశ్లేషకులకి ఇళయ దళపతి ‘విజయ్'(విజయ్)చాలా సార్లు కల్పించాడు. కానీ కొత్త పేర్లు కనుక్కొనే లోపే వెంటనే మరో కొత్త రికార్డుని విజయ్ సృష్టిస్తుండటంతో సినీ విశ్లేషకులు చేతులెత్తేశారు. అంతలా విజయ్ తన చిత్రాల ద్వారా సరికొత్త రికార్డులని సృష్టిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినిమా ఫంక్షన్ ద్వారా కూడా అదిరిపోయే రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

మొన్న శనివారం విజయ్ అప్ కమింగ్ మూవీ ‘జన నాయకన్'(జన నాయకన్)ఆడియో లాంచ్ వేడుక మలేషియా(మలౌసియా)దేశంలో జరిగిన విషయం తెలిసిందే. ఇండియా వెలుపల జరిగినా వరల్డ్ వైడ్ గా ఉన్న విజయ్ అభిమానులు మలేషియాకి క్యూ కట్టారు. ఇప్పుడు ఈ విషయంలోనే విజయ్ అరుదైన రికార్డుని అందుకున్నాడు. సుమారు 85000 మంది అభిమానులు ఆ ఈవెంట్ కి కనిపిస్తారు. దీంతో అవుట్ ఆఫ్ కంట్రీ లో జరిగిన తమిళ సినిమా ఆడియో ఈవెంట్ కి సంబంధించి ఆ స్థాయిలో ప్రజలు రావడం అదే తొలిసారి. దీంతో ఈ ఈవెంట్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో అధికారకంగా చేరింది.


ఇది కూడా చదవండి: ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన అఖండ 2 టీం.. రేట్స్ ఇవే

ఇక జన నాయకన్ జనవరి 9 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండగా ఈసారి అభిమానులు తమ గుండెల్లో ఆనందాన్ని, భావోద్వేగాన్ని మిక్స్ చేసుకొని మూవీని చూడనున్నారు. ఎందుకంటే జన నాయకన్ విజయ్ ఆఖరి చిత్రం. ఈ మేరకు విజయ్ అధికారంగా చెప్పడమే కాకుండా పొలిటికల్ గా ప్రజలకి సేవ చేసేందుకే సినిమాలకి స్వస్తి చెప్పనున్నానని వెల్లడి చేసాడు. ఇక జన నాయకన్ లో విజయ్ కి జతగా పూజ హెగ్డే చేస్తుండగా, ప్రేమలు ఫేమ్ మమిత భైజు ఒక ముఖ్య పాత్రలో చేస్తుంది. విజయ్ (H Vinoth)దర్శకత్వంలో కే వి ఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ , అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి కథ, జన నాయకన్ కి పోలి ఉండబోతోందనే టాక్ చాలా బలంగా వినిపిస్తోంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird