Home సినిమా ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఉన్న పేర్లు నిజమేనా! – MS Live 99 News

ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఉన్న పేర్లు నిజమేనా! – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
ప్రముఖ సీరియల్ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఉన్న పేర్లు నిజమేనా!
2,813 Views




-ఎందుకు సూసైడ్ చేసుకుంది
-లెటర్ లో ఉన్న పేర్లు నిజమేనా!
-ఎంతో భవిష్యత్తు ఉంది
-తీవ్ర ఆవేదనలో తోటి నటులు, ఫ్యాన్స్

తమిళంలో టెలికాస్ట్ అవుతున్న’గౌరీ'(గౌరీ)అనే సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి ‘నందిని'(నందిని). ఈ సీరియల్ లో దుర్గ, కనక అనే డ్యూయల్ రోల్ లో ఆమె నటించిన నటనకి ఫిదా కానీ తమిళ బుల్లితెర ప్రేమికులు లేరంటే అతిశయోక్తి కాదు. కన్నడ లోను జీవ హేవాగిడే, సంఘర్ష, మధుమగలు, నీనాడే వంటి ఫేమస్ సీరియల్స్ లో కనిపించి కన్నడ టీవీప్రేక్షకులని కూడా మెప్పిస్తూ వస్తుంది. అటువంటి నందిని ఆకస్మిక మరణం ఇప్పుడు ఎంటైర్ దక్షిణ టీవీ ఇండస్ట్రీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తుంది.

నందిని నిన్న బెంగుళూరు(Bengaluru)లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తను సూసైడ్ చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరు లేరని.కానీ సంఘటన స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సూసైడ్ నోట్‌లో ‘యాక్టింగ్ కెరీర్‌లో కొనసాగాలని భావించినా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేయడంతో, నందిని విపరీతమైన డిప్రెషన్‌లోకి వెళ్లడం వల్లే సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు రాసి ఉందనే వాదనలు సర్క్యులేట్ అవుతున్నాయి. పోలీసులు ఆ సూసైడ్ నోట్ ప్రకారమే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సంస్థ కూడా బెంగుళూరు మీడియా వర్గాల్లో న్యూస్ హల్ చల్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: అగ్ర హీరో కూతురు బాడీ పై ట్రోల్స్.. వీళ్లేనా!

గౌరీ సీరియల్ తమిళ సీరియల్ అయినా మొదట నుంచి బెంగుళూరులోనే షూట్ జరుగుతుంది. కానీ షూటింగ్ ఇటీవల బెంగుళూరు నుంచి చెన్నైకి షూటింగ్ మారడంతో, కొన్ని రోజుల నుంచి అక్కడే షూటింగ్ జరుగుతుంది. కానీ బ్రేక్ రావడంతో నందిని బెంగుళూరు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా టాక్ . ఇక నందిని మరణంపై అభిమానులు, కో యాక్టర్స్ సోషల్ మీడియా వేదికగా తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గౌరీ ని ప్రముఖ ‘కలైంజర్’ టీవీ నందిని మృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తీవ్ర సంతాపం తెలియజేసింది. నందిని ఆంధ్రప్రదేశ్ కి చెందిన అచ్చ తెలుగమ్మాయి.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird