
బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణల కాంబోలో తెరకెక్కిన అఖండ 2 సినిమాపై చిత్ర సీమతో పాటు బాలయ్య అభిమానుల్లో, సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లతో పాటు ఒక సాంగ్ అఖండ 2పై భారీ అంచనాలను పెంచేశాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 చిత్రం విడుదలైంది.
అన్ని పెద్ద సినిమాల మాదిరిగానే అఖండ 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు, ప్రీమియర్ షోలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విడుదల చేశాయి. సనాతన ధర్మం, శివతత్వం, అఘోరాల నేపథ్యంతో వస్తున్న అఖండ 2 ప్రీమియర్‌లు క్యాన్సిల్ చేసిన చిత్రం షో బృందం ప్రకటించింది. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో అఖండ 2 నిర్మించారు. కాగా ‘అఖండ 2’ మూవీ అసలు అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా? లేదా? అనే అనుమానాలు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షక అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి అలాగే 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి గతంలో జరిగిన లావాదేవీలలో కొన్ని అప్పులు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 90 కోట్లకు పైగా ఫైనాన్సియర్స్‌కి చెల్లించవలసి ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ రెండు సంస్థలు ఇదివరకు తీసిన సినిమాల బకాయిలు అధికమై ‘అఖండ 2’పైన ఆ భారం పడ్డట్లు గుసగుసలు. ఈ విషయాలు తేలేవరకు సినిమా రిలీజ్ కూడా కష్టమే అనుకుంటున్నారు. బాలకృష్ణ బరిలోకి దిగి రాత్రికి రాత్రే సద్దుమణిగేలా చేస్తారని అనుకుంటున్నారు. ఇక ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి బాలయ్య ఫ్యాన్స్‌లో కంగారుగా ఉంది
