
-రణబీర్ ఏం చేసాడు?
-భారతీయులు గర్వపడే సినిమా
-నెటిజెన్స్ ఫైర్
-బడ్జెట్ 4000 కోట్లు
భారతీయులతో పాటు రామ భక్తులందరు సగర్వంగా తలెత్తుకొని ఇది మా మూవీ అని ప్రపంచ సినిమాకి చెప్పుకునే విధంగా ‘రామాయణ'(రామాయణం)తెరకెక్కుతుంది. రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా బడ్జెట్ సుమారు 4000 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి రామాయణ రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. రాముడు గా రణబీర్ కపూర్(Ranbir kapoor),సీతమ్మ తల్లిగా సాయిపల్లవి(saipallavi)తమ ప్రాణం పెట్టి చేస్తున్నారు. రామాయణం కోసం చిత్ర యూనిట్ లో చాలా మంది తమ వ్యక్తిగత అలవాట్లను మార్చుకుంటున్నామని కూడా చెప్పారు.
ఈ కోరికనే కొన్ని రోజుల క్రితం రణబీర్ కి చెందిన పీఆర్ టీం సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాముడి పాత్ర దగ్గర నుంచి రణబీర్ సర్ నాన్ వెజ్, సిగరెట్, ఆల్కహాల్ అన్నీ ఆపేసారు. సాత్విక్ ఫుడ్, యోగా, మెడిటేషన్‌తో చాలా పద్దతిగా ఉంటున్నారని ప్రకటించారు. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్,రామభక్తులు రణ్ బీర్ని మెచ్చుకున్నారు. కానీ రీసెంట్ గా ‘డైనింగ్ విత్ ది కపూర్స్’ డాక్యుమెంటరీ కి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది.
వీరి వీడియోలో రణబీర్ తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. నీతూ కపూర్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, రీమా జైన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఫిష్ కర్రీ, రైస్, జంగల్ మటన్, పాయా వంటి వాటిని రణబీర్ సోదరుడు అర్మాన్ జైన్ సర్వ్ చేస్తుంటే అందరూ తింటూ ఉన్నారు.
కూడా చదవండి: పెద్దిలో జాన్వీ కపూర్ కి డూప్ ని పెట్టారా!.. బాంధవి శ్రీధర్ ఎవరు
ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్ కంటపడడంతో సోషల్ మీడియా వేదికగా ప్రదర్శకుడి రాముడిగా చేస్తూ మటన్ తింటావా? సాత్విక్ డైట్ అనేది అబద్ధమేనా?అని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో #RanbirHypocrisy,#RamayanaControversy లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.మరి ఈ విషయంపై రణ్‌బీర్ టీం ఏ వివరణ ఇస్తుందో చూడాలి. వచ్చే ఏడాది దీపావళి కానుకగా మొదటి భాగం, ఆ పై ఏడాది దివాలికి రెండవ భాగం విడుదల కానున్నాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ‘యష్'(యష్)రావణుడిగా చేస్తుండగా దంగల్ మూవీ ఫేమ్ నితీష్ తివారి(నితేష్ తివారీ)దర్శకుడు. నమిత్ మల్హోత్రా(నమిత్ మల్హోత్రా)నిర్మాణ సారధ్యంలో ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.


CEO
Mslive 99news
Cell : 9963185599
