Home సినిమా నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. కంటతడి పెట్టిస్తున్న సంపత్ నంది పోస్ట్! – MS Live 99 News

నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. కంటతడి పెట్టిస్తున్న సంపత్ నంది పోస్ట్! – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. కంటతడి పెట్టిస్తున్న సంపత్ నంది పోస్ట్!
2,807 Views



టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం. సంపత్ తండ్రి నంది కిష్టయ్య మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు.

తండ్రి మరణంతో ఎంతో బాధలో ఉన్న సంపత్ నంది.. ఆ బాధను అక్షరాలుగా మలిచి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుండె నిండా బాధతో, తడిచిన కళ్ళతో, వణుక చేతితో రాసిన ఆ పోస్ట్.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేలా ఉంది. (సంపత్ నంది)

“బాపు.. నువ్వు లేకుండానే ఇక రేపు, ఎల్లుండి, జీవితమంతా..
నువ్ లేకుండానే తెల్లారింది..
నువ్ లేకుండానే ఓదెల లేచింది..
నువ్ లేకుండానే ఇల్లు లేచింది.
కల్లాపి తో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిసింది..
“ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు..
“ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు
ఎక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు!
చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది..
గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నెన్నే కదా అనిపిస్తోంది..
నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక..
మనం దున్నిన జంబు అరక..
పత్తి మందుకు పంపు..
పల్లి చేను లో సద్ది..
మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు..
ఇక అన్నీ జ్ఞాపకాలేనా?
దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు..
మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు..
ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా?
ఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి..
నీకు నలుగురు పిల్లలు.. వాళ్ళకీ పిల్లలు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో..
కానీ మళ్లీ రా..”

– సంపత్ నంది

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird