Home సినిమా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు.. రాజమౌళి పోస్ట్ వైరల్! – MS Live 99 News

గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు.. రాజమౌళి పోస్ట్ వైరల్! – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు.. రాజమౌళి పోస్ట్ వైరల్!
2,806 Views



సూపర్‌స్టార్‌ మహేశ్‌, ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ అడ్వంచరస్‌ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్‌ రామోజీ ఫిలింసిటీలో శనివారం ఎంతో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే వేలాదిగా అభిమానులు రామోజీ ఫిలింసిటీకి చేరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్‌లో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఉందంటూ రాజమౌళి చేసిన పోస్ట్‌తో అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. ఈ కార్యక్రమంలో సినిమా టైటిల్‌ను ప్రకటించడమే కాదు, మహేశ్‌బాబు పాత్ర, గెటప్‌తోపాటు సినిమా నిర్మాణానికి సంబంధించిన విజువల్‌ను కూడా ఆవిష్కరించారు. 100 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మెగా స్క్రీన్‌పై ఈ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నారు.

మరోవైపు ఈవెంట్‌కు రూపొందించిన ప్రత్యేక పాస్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాస్‌పోర్ట్ డిజైన్‌లో రూపొందించిన ఈ పాస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులు ఎలాంటి తొందరపడకుండా, ఒకరికొకరు సహకరిస్తూ కార్యక్రమం సజావుగా సాగడానికి సాయం చేయాలని రాజమౌళి, మహేశ్‌బాబు ప్రత్యేక వీడియో ద్వారా విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేక ప్లానింగ్ చేశారు.

ఈ భారీ ఈవెంట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు జియో హాట్‌స్టార్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. ఈ సమయంలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకలోకం ఎదురుచూస్తోంది. హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎంతో ఫిల్మ్ మేకర్స్‌ ఈ ఈవెంట్‌కి హాజరుకానంత మంది సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird