
మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఏర్పడిన రోజు రానే వచ్చింది. మహేష్-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందించిన సినిమాకి ‘వారణాసి’ టైటిల్‌ను ఖరారు చేశారు. (వారణాసి)
మహేష్-రాజమౌళి కాంబోలో కె.ఎల్.నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ నిర్మించారు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి కొద్దిరోజులుగా ‘వారణాసి’ టైటిల్ ప్రచారం జరుగుతోంది. తాజాగా అదే టైటిల్ ని అధికారికంగా ప్రకటించింది.
టైటిల్ రివీల్ తో పాటు, ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం కోసం శనివారం సాయంత్రం గ్లోబ్ ట్రాటర్ పేరుతో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ లో ‘వారణాసి’ అనే టైటిల్ ని రివీల్ చేశారు. అంతేకాదు, గ్లింప్స్ లో నంది మీద త్రిశూలం పట్టుకొని మహేష్ కనిపించిన తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా మహేష్ బాబుని రాజమౌళి చూపించబోతున్నారని గ్లింప్స్ తో క్లారిటీ వచ్చింది.


CEO
Mslive 99news
Cell : 9963185599
