Home సినిమా లెజండ్రీ హీరోయిన్ మృతి.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు – MS Live 99 News

లెజండ్రీ హీరోయిన్ మృతి.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
లెజండ్రీ హీరోయిన్ మృతి.. భారతీయ చిత్ర పరిశ్రమకి ఎన్నో సేవలు
2,803 Views



అగ్ర హీరోలతో జతకట్టిన రికార్డు
అసలు పేరు ఉమా కశ్యప్
తొలి అవకాశం ఇచ్చిన చేతన్ ఆనంద్
మరణానికి కారణం ఇదే

భారతీయ చిత్ర పరిశ్రమని ఏలిన ఎంతో మంది నటిమణుల్లో అలనాటి సీనియర్ నటిమణి ‘కామిని కౌశల్'(కామిని కౌశల్)కూడా ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై ఆమె నటిస్తుంటే అందం, అభినయం పోటీ పడుతూ ఉంటుంది. అంతలా తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చెయ్యగల ఒక అద్వితీయ సమ్మోహన శక్తి. ఆమె పరిచయమైన మొట్టమొదటి చిత్రం ‘నీచానగర్'(నీచానగర్) ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్(కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్)లో ప్రదర్శించడం విశేషం.

మొన్న గురువారం రాత్రి ముంబై(ముమాబాయి)లోని తన నివాసంలో కామిని కౌశల్ మరణించడం జరిగింది. ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులు అధికారకంగా వెల్లడి చేసారు. ప్రస్తుతం ఆమె వయసు తొంబై ఎనిమిది సంవత్సరాలు. వృధాప్య సమస్యలు తలెత్తడంతోనే తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. కామిని కౌశల్ అసలు పేరు ఉమా కశ్యప్. మొదట ఆకాశవాణిలో వచ్చే రేడియో నాటకాల్లో ప్రదర్శన ఇచ్చేవారు. వాయిస్ బాగా పాపులర్ అవ్వడంతో అప్పటికే దర్శక, నిర్మాతగా రాణిస్తున్న ‘చేతన్ ఆనంద్’ సినిమాల్లో ఆమెకి మొదటి అవకాశం ఇచ్చాడు. ఆ చిత్రమే కేన్స్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించిన నీచానగర్. తన పేరుని కామిని కౌశల్ గా మార్చింది కూడా ఆయనే. ఇక అక్కడ్నుంచి ఆమె వెనుతిరిగి చూసుకునే అవసరం లేకపోయింది. తన అద్భుతమైన నటనతో ఎన్నో క్యారక్టర్ లకి సజీవ రూపాన్ని తీసుకొచ్చింది.లెజండ్రీ యాక్టర్స్ రాజ్ కుమార్, దిలీప్ కుమార్, అశోక్ కుమార్, దేవ్ ఆనంద్ ల సరసన నటించిన రికార్డు కూడా ఆమె సొంతం.


ఇది కూడా చదవండి: ఐ బొమ్మ నిర్వాకుడు రవి అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే

హీరోయిన్ గా తన ప్రస్థానం 1946 నుంచి 1968 వరకు సాగింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు, సన్మానాలు ఉన్నాయి. ఆ తర్వాత ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా, చెన్నై ఎక్స్ ప్రెస్, లాల్ సింగ్ చద్దా, కబీర్ సింగ్ వంటి పలు చిత్రాలలో తల్లిగా, బామ్మగా కూడా కనపడి మెస్మరైజ్ చేశారు. సుమారు తొంబై చిత్రాల వరకు ఆమె జాబితాలో ఉన్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. లాహోర్ ఆమె స్వస్థలం కాగా 1927 ఫిబ్రవరి 24 న.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird