Home సినిమా తమన్నా ఓజంపిక్ ఇంజెక్షన్స్ వాడుతోందా! – Swen Daily

తమన్నా ఓజంపిక్ ఇంజెక్షన్స్ వాడుతోందా! – Swen Daily

by
0 comment
తమన్నా ఓజంపిక్ ఇంజెక్షన్స్ వాడుతోందా!
2,806 Views



-తమన్నా పై ఆరోపణలు
-వివరణ ఇచ్చిన తమన్నా
-మహిళల్లో ప్రతి ఐదేళ్లకి మార్పులు
-అప్ కమింగ్ మూవీస్ ఇవే

పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై స్టార్ నటీమణి ‘తమన్నా'(తమన్నా భాటియా)కి ఉన్న చరిష్మా మరో నటికి లేదంటే అతిశయోక్తి కాదు. 2005లో సినీ రంగ ప్రవేశం చేసి రెండున్నర దశాబ్దాల నుంచి తన హవా కొనసాగడం అంటే అతిశయోక్తి కాదు. దీనికి అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకునే గ్లామర్ చాలా ముఖ్యం. పైగా హీరోయిన్ గా ఎంత పాపులారిటీ ని సంపాదించిందో, ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లోను అంతే పాపులరిని సంపాదించింది. పైగా తమన్నా స్పెషల్ సాంగ్ ఉందంటే చాలు ఆ సినిమాకి ప్రేక్షకులు అభిమానులు క్యూ కడుతున్నారు. బడా హీరోలు, మేకర్స్ సైతం తమన్నా’ సినిమాలో ‘సాంగ్ ఉండాలని కోరుకుంటున్నారంటే తమన్నా బ్రాండ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

కొంత కాలం నుంచి తమన్నా ఒంటి తీరుపై సోషల్ మీడియా వేదికగా చాలా రూమర్స్ వస్తున్నాయి. బరువు తగ్గేందుకు తమన్నా ‘ఓజంపిక్'(ozempic)లాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటుందనేది సదరు సారాంశం. ఈ వార్తలపై రీసెంట్ గా తమన్నా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ పదిహేను సంవత్సరాల వయసు నుంచి కెమెరా ముందు నటించాను. కాబట్టి నేను దాచడానికి ఏమి లేదు. కెమెరా తోనే నా ప్రయాణం కొనసాగుతుంది.టీనేజ్ లో స్లిమ్ గా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉండాలని అనుకుంటున్నాను. అంతే గాని ఇందులో దాచడానికి ఏం లేదు. పైగా నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. సాధారణంగా మహిళల్లో ప్రతి ఐదేళ్లకు మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడు ఒకే శరీరాకృతిలో కనిపించలేమని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: బెల్లంకొండ సురేష్‌పై కబ్జా ఆరోపణలు!..ఫిల్మ్‌నగర్‌లో కేసు నమోదు

ప్రస్తుతం తమన్నాలిస్ట్ లో ఓ రోమియో రేంజర్, వ్యాన్, రాగిణి ఎంఎస్ఎస్ 3 తో ​​పాటు ఫోటో చిత్రాలు ఉన్నాయి. తమన్నా ఇటీవల బెట్టింపుల యాప్ కి సంబంధించి ప్రమోషన్ చేసిన కేసులో ఇరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird