Home సినిమా అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్నిరోజులు ఆడవచ్చు.. ఫ్యాన్స్ కోరిక తీరుతుందా! – Swen Daily

అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్నిరోజులు ఆడవచ్చు.. ఫ్యాన్స్ కోరిక తీరుతుందా! – Swen Daily

by
0 comment
అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్నిరోజులు ఆడవచ్చు.. ఫ్యాన్స్ కోరిక తీరుతుందా!
2,806 Views




-అఖండ 2 ఆ థియేటర్ లో ఎన్ని రోజులు ఆడుతుంది!
-లెజెండ్ 1000 రోజులు ఆడిన థియేటర్ ఏది!
-అఖండ 2 పై అభిమానుల్లో భారీ అంచనాలు
-త్వరలోనే వరుస ప్రమోషన్లు

‘వింటే భారతం వినాలి..తింటే గారెలు తినాలి.. సినిమా అంటూ చూస్తే బాలయ్య(బాలయ్య),బోయపాటి(బోయపాటి శ్రీను)కాంబోలో సినిమా చూడాలంటే సామెత అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో చాలా బలంగా ఉంది. అందుకు తగ్గట్టే సినిమా సినిమాకి తమ కాంబో రేంజ్ ని పెంచుకుంటూ వస్తున్నారు. ఎంతలా అంటే ఒక సినిమా వంద రోజులు రెండు వందల రోజులు ఆడటం అనేది ప్రేక్షకులతో పాటు సిల్వర్ స్క్రీన్ ఎప్పుడో మరిచిపోయింది. కానీ ఈ కాంబో మాత్రం ప్రేక్షకులకి, ఇద్దరి సిల్వర్ స్క్రీన్ కి ఆ పండుగల్ని గుర్తు చేస్తుంది. వంద, రెండు వందల రోజులే కాదు వెయ్యి రోజుల ఆడటం దాకా ఆ పండుగని తీసుకెళ్లారు.

అందుకు బీజం వేసిన మూవీ లెజెండ్(లెజెండ్). మార్చి 28 2014 న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ రన్నింగ్ పరంగా తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 1000 రోజులు రన్నింగ్ అయ్యి బాలయ్య కి రాయలసీమలో ఉన్న చరిష్మా ఏ పాటిదో తెలియచేసింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఇంత వరకు ఎవరు టచ్ చేయని రికార్డు అని కూడా చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి బాలయ్య, బోయపాటి అప్ కమింగ్ మూవీ అఖండ 2(అఖండ 2)పై పడింది. ఈ మేరకు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు ‘అఖండ 2 ని బాలయ్య, బోయపాటి ఎంతో ప్రెస్టేజియస్ట్ గా తీసుకుంటున్నారు.


ఇది కూడా చదవండి: ఎవర్ గ్రీన్ హీరో ధర్మేంద్ర అస్తమయం. ప్రముఖుల నివాళి

ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సినిమా బాగా వస్తుందని, అఖండ కూడా చాలా మించి ప్రదర్శనతోందని మేకర్స్ పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. పైగా మూవీ డేవోషనల్ కంటెంట్ తో వస్తుంది. ప్రస్తుతం డేవోషనల్ కంటెంట్ కి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దీనికి బాలయ్య, బోయపాటి కాంబో యాడ్ అయ్యింది. దీనితో ప్రొద్దుటూరు అర్చన థియేటర్ లో లెజెండ్ రన్నింగ్ డేస్ రికార్డుని పార్ట్ 2 బద్దలు కొట్టడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో అభిమానుల కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird