మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో అభిమానులు రూపొందిస్తున్న సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు, ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ ద్వారా ‘కుంభ’ గెటప్‌లో ఉన్న పృథ్విరాజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. వీల్‌చైర్‌లో కూర్చోవడం, రోబోటిక్ సపోర్ట్‌తో ఉన్న శక్తివంతమైన వ్యక్తిగా కనిపించారు. వీల్ చైర్‌లో ఉంటూ ఎన్నో అద్భుతాలు సృష్టించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గురించి మనకు తెలుసు. అతని స్ఫూర్తితోనే కుంభ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు.
SSMB29కి సంబంధించి నవంబర్ 15న మరిన్ని అప్‌డేట్‌లు రాబోతున్నాయి. ఈ సినిమా టైటిల్ ఏమిటి అనే విషయంలో ఇప్పటివరకు రకరకాల చర్చలు జరిగాయి. అయితే ఈ సినిమాకి ఏ టైటిల్ పెడతారు అనే విషయంలో నవంబర్ 15న క్లారిటీ రాబోతోంది. అదే రోజున మహేష్ ఫస్ట్‌లుక్‌తోపాటు 2 నిమిషాల నిడివి ఉన్న కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేయబోతున్నారు.
టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రపంచవ్యాప్తంగా మహేష్, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం రూపొందిస్తున్నారు. వీరిద్దరి ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ జోనర్‌లో ఉండబోతోంది. ఇప్పటివరకు మహేష్ కనిపించని ఒక డిఫరెంట్ లుక్‌లో రాబోతున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
కుంభ పాత్రలో అతని నటనను చూసిన రాజమౌళి ‘ఫస్ట్ షాట్ తీసిన వెంటనే పృథ్వీ దగ్గరికి వెళ్లి.. నేను చూసిన అత్యంత గొప్ప నటుల్లో నువ్వు ఒకరు అని చెప్పాను. ఈ దుర్మార్గుడైన, నిర్దాక్షిణ్యమైన, శక్తివంతమైన ప్రతినాయకుడు ‘కుంభ’ పాత్రకు జీవం పోయడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ కుర్చీలో అక్షరాలా నువ్వు జారిపోయి ఆ పాత్రలో కలిసిపోయినందుకు ధన్యవాదాలు పృథ్వీ’ అంటూ పోస్ట్ చేశారు.
