Home సినిమా పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు – MS Live 99 News

పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు – MS Live 99 News

by MS LIVE 99 NEWS
0 comment
పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా.. అనఫీషియల్ న్యూస్‌లో అనేక మార్పులు
2,811 Views



– సల్మాన్‌ఖాన్‌తో వంశీ పైడిపల్లి మూవీ కన్‌ఫర్మ్?

– కొత్త సినిమాలపై నోరు విప్పని దిల్‌రాజు

– పవన్ కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా ఉందని ఎవరు చెప్పారు

గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రచారం. మొదట ఈ సినిమాకి అనిల్‌ రావిపూడిని దర్శకుడిగా ఎంపిక చేసి టాక్ నడిచింది. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి వంశీ పైడిపల్లిని తీసుకొని ఆ వార్తను సర్క్యులేట్ చేశారు. అయితే ఈ రెండు వార్తలూ అధికారికం కాదు. దిల్‌రాజుగానీ, ఆయాలు గానీ ఎక్కడా ఈ డైరెక్టర్ ప్రస్తావించలేదు. కేవలం ప్రచారం జరుగుతున్న వార్తల్లోనే పలు మార్పులు చోటు చేసుకోవడం విచిత్రంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో హిందీ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతోందనేది ఆ వార్త.

ఇది కూడా చదవండి: దీపికపై ‘కల్కి’ టీమ్ కక్ష సాధింపు.. అది చిన్నపిల్లల చర్య అంటూ విమర్శలు!

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి స్థానంలో వంశీ పైడిపల్లిని తీసుకున్నారంటూ న్యూస్‌ వచ్చింది. అయితే ఇవేవీ అధికారికంగా ప్రకటించిన వార్తలు కాదు. కానీ, ఈ ఊహాగానాల్లోనే పలు మార్పులు, చేర్పులు చేస్తూ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు.

Also Read: ఘనంగా జరిగిన అల్లు శిరీష్, నైనికా ఎంగేజ్మెంట్.. మెగా హైలెట్స్ ఇవే

ఇప్పుడు తాజాగా సల్మాన్‌ ఖాన్‌తో వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారని అంటున్నారు. సల్మాన్‌కి వంశీ కథ చెప్పడం, అది ఓకే అవ్వడం కూడా జరిగిపోయిందనేది ప్రచారంలో ఉన్న వార్త. దీన్నిబట్టి పవన్‌కళ్యాణ్‌తో దిల్‌రాజు సినిమా లేదు అని కూడా చెబుతున్నారు. తన కాంపౌండ్‌లో ఉన్న డైరెక్టర్‌లతోనే దిల్‌రాజు సినిమాలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తను చెప్పినట్టు వినే డైరెక్టర్లకే దిల్‌రాజు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తారు. అందుకే అతని ప్రొడక్షన్‌లో డైరెక్టర్లు రిపీట్‌ అవుతారు.

Also Read: నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!

ఆ విధంగానే ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హిందీ సినిమా చేయబోతున్నారని సమాచారం. మరో పక్క ఓజీ2 చిత్రం నుంచి డి.వి.వి.దానయ్య తప్పుకున్నాడని, ఆ సినిమాను కూడా దిల్‌రాజే నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దిల్‌రాజుకు సంబంధించిన ఈ ప్రాజెక్టుల పరిశీలన ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం వీటి గురించి రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏది ఏమైనా దిల్‌రాజు తను చేయబోయే సినిమాల వివరాలను అధికారికంగా ప్రకటించే వరకు దేన్నీ నమ్మే పరిస్థితి లేదు.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird