 
						
 
సినిమా పేరు: మాస్ జాతర  
తారాగణం:రవితేజ, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర, నరేష్, ప్రవీణ్, హిమజ, విటివి గణేష్ 
సంగీతం: భీమ్స్ 
ఎడిటర్:నవీన్ నూలి 
రచన, దర్శకత్వం: భాను బోగవరపు 
సినిమాటోగ్రాఫర్:విధు అయ్యన 
బ్యానర్: సితార ఎంటర్ టైన్ మెంట్స్ 
నిర్మాత: నాగవంశీ
విడుదల తేదీ: నవంబర్ 1 2025 
మాస్ మహారాజా రవితేజ(రవితేజ)ఈ రోజు ‘మాస్ జాతర'(Mass jathara)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవి తేజ తో శ్రీలీల సహా థమాక టీం మాస్ జాతర తో జాయిన్ అవ్వడం, ప్రచార చిత్రాలు బాగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మాస్ జాతర పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
లక్ష్మణ్ భేరి(రవితేజ) తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కి చెందిన ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్. రైల్వే ప్లాట్ ఫారమ్ పైకి టికెట్ కొనుక్కొని రాకపోయినా వాళ్ళ అంతుచూసేటంత సిన్సియర్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ అవుతా లోని శ్రీకాకుళంలోని అడవివరం అనే ట్రాన్స్ ఫర్ ఫర్.అదే ఏరియాలో శివుడు(నవీన్ చంద్ర) అసాంఘిక వ్యక్తితో పాటు గంజాయి డీలర్. అడవి వరం లోని మనుషులు కూడా శివుడుకి సపోర్ట్. తులసి(శ్రీలీల) ఒక టీచర్. లక్ష్మణ్ భేరి తొలి చూపులోనే తులసి ని ప్రేమిస్తాడు. కానీ తులసి గంజాయి అమ్ముతు టీచర్ గా నమ్మిస్తూ ఉంటుంది. శివుడుకి లక్ష్మణ్ భేరి కి చంపుకునేంత శత్రుత్వం ఏర్పడుతుంది. అసలు వరంగల్ లో ఉన్న లక్ష్మణ్ భేరి శ్రీకాకుళంకి ట్రాన్స్ ఫర్ ఎందుకు అయ్యాడు? రైల్వే పోలీస్ అయిన లక్ష్మణ్ కి సంఘవిద్రోహ శక్తులకు సంబంధం ఏంటి? తులసి నిజంగానే గంజాయి అమ్మే అమ్మాయినా ?ఒకవేళ ఆమె మంచి వ్యక్తి అయితే ఆమె కథ ఏంటి? తులసి, లక్ష్మణ్ ల లవ్ ఏమైంది? శివుడికి, లక్ష్మణ్ కి మధ్య పోరాటం ఎందుకు వచ్చింది? ఎవరు వస్తే గెలిచారు అనేదే మాస్ జాతర
ఎనాలసిస్
ఇలాంటి కథలు తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి రాని సంవత్సరం లేదని చెప్పవచ్చు. అనేక సన్నివేశాల ఇన్స్పిరేషన్ తో ప్రదర్శించబడే అభిప్రాయం కూడా కలుగుతుంది. మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. కాకపోతే రవితేజ లో ఉన్న ఎనర్జీ పెర్ ఫార్మెన్సు చివరికి దాకా థియేటర్స్ లో కూర్చోబెట్టగలిగింది. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రారంభం ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఉన్నా స్లో గా రెగ్యులర్ ఫార్మాట్ లోకి వచ్చింది. లక్ష్మణ్ బేరి అతని తాత మధ్య వచ్చే సన్నివేశాలు పెద్దగా నవ్వు పుట్టించేదేమి లేదు. అడవివరం రాగానే కథ, కధనం విషయంలో ఏమైనా చేంజ్ వస్తుందేమో అని అనుకుంటాం. అది కూడా లేదు. రొటీన్ కథనాలే సాగాయి. లక్ష్మణ్ భేరి, తులసి మధ్య లవ్ సీన్స్ తో పాటు లక్ష్మణ్ కి సదరు లవ్ లో ఎదురయ్యే ఇబ్బందులని కూడా బాగానే ఎస్టాబ్లిష్ చెయ్యవచ్చు. కానీ మేకర్స్ ఆ దిశగా ఎక్కువగా ఆలోచించలేదు. ఒకే పాయింట్ పై కథనాన్ని నడిపించారు. సాంగ్స్ కూడా పెద్దగా బాగోలేదు. ఇక సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ బాగా ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మణ్ భేరి, తులసి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా హైలెట్. కాకపోతే శివుడు, లక్ష్మణ్ మధ్య రొటీన్ సీన్స్ రావడం, కథ కి ఎక్కువ స్పాన్ లేకపోవడం ప్రతికూలంగా ఉంటుంది. నటినటుల మధ్య ఎక్కువ బ్యాండింగ్ కూడా లేదు. క్లైమాక్స్ అందరు రొటీన్ గా ఆలోచించే విధంగా రావడం విశేషం. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్ .
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
లక్ష్మణ్ భేరి క్యారక్టర్ లో రవితేజమరోసారి తనదైన స్టైల్లో విజృంభించి నటించాడు. తన క్యారక్టర్ పరిధి మేరకు అన్ని వేరియేషన్స్‌లో మెస్మరైజ్ చేయడంలో ఏ మాత్రం వెనుకాడలేదు. శ్రీలీల(Sreeleela)కి పెర్ఫార్మెన్స్ పరంగా తక్కువ నిడివి ఉన్నా, ఆ క్యారక్టర్ కి మించి ఎక్కువగా ఆలోచించలేం. నవీన్ చంద్ర విలన్ గా మెప్పించాడు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమా విలన్ నేనే అనేలా జీవించాడు. లక్ష్మణ్ భేరి తాతగా రాజేంద్ర ప్రసాద్ గారు మరో సారి తను ఎంత వాల్యుబుల్ నటుడో నిరూపించారు. నరేష్ గారు ఉన్న నామ మాత్రపు ప్రదర్శనకే పరిమిత మయ్యారు. మిగిలిన ఆర్టిస్టుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు.భాను బోగవరపు(భాను బోగవరపు)దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. కానీ ఓల్డ్ కథ కావడం మైనస్. భీమ్స్(Bheems)అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ సో మాత్రం సో. నాగ వంశీ నిర్మాణ విలువలు, ఫోటోగ్రఫీ ప్రాణంగా నిలిచాయి. డైలాగ్స్ లో కూడా మెరుపులు ఏం లేవు.
ఫైనల్ గా చెప్పాలంటే రవితేజ ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ మెప్పిస్తుంది. కానీ రొటీన్ కథ, కథనాలు మాస్ జాతర కి మైనస్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్.
రేటింగ్ 2 .25/5
అరుణా చలం
 
			         
			         
														 
															