 
						

– మహేష్, సందీప్ రెడ్డి కాంబోలో మూవీ!
– కథ రెడీ చేస్తున్న సందీప్!
– మరి స్పిరిట్ ఎప్పుడు?
ప్రభాస్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన సౌండ్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘స్పిరిట్’ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో సృష్టించారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి ఒక కథ సిద్ధం చేస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది. దీంతో ‘స్పిరిట్’ సంగతేంటి అని చర్చ జరుగుతోంది.
మహేష్ బాబు, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా అనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ‘అర్జున్ రెడ్డి’ సమయంలోనే కథా చర్చలు జరిగాయి. కానీ, ఎందుకనో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాంటిది ఇప్పుడు మహేష్ నెక్స్ట్ మూవీ సందీప్ డైరెక్షన్ లో చేయడం ఫిక్స్ అయిందని అంటున్నారు.
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ భారీ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నాడు. 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సందీప్ తో మహేష్ మూవీ చేయనున్నాడని వినికిడి.
ఇది కూడా చదవండి: మాస్ జాతర బిజినెస్.. ఈసారైనా హిట్ కొడతాడా..?
సందీప్ ఇప్పటికే ‘స్పిరిట్’ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు వందనే షూటింగ్ కంప్లీట్ చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు సందీప్. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో ప్రభాస్ ప్రస్తుతం ఉండటంతో.. ఈ గ్యాప్ లో ‘స్పిరిట్’ వర్క్ తో పాటు, మహేష్ సినిమా కథపై కూడా సందీప్ కసరత్తులు చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ ఒక షేప్ కి వచ్చిందని, తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ ని లాక్ చేసే పనిలో ఉన్నాడని టాక్. ఇటు ప్రభాస్ ‘స్పిరిట్’ పూర్తయ్యింది, అటు రాజమౌళి ప్రాజెక్ట్ నుండి మహేష్ ఫ్రీ కాగానే.. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.
రాజమౌళి సినిమాతో హీరోల ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీంతో ఆ తదుపరి సినిమాలను డైరెక్టర్ హ్యాండిల్ చేయడంలో తడబడుతుంటారు. అయితే మహేష్ విషయంలో అలాంటిది జరగకపోవచ్చు. సందీప్ రెడ్డి డైరెక్టర్ అని న్యూస్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డినే బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.
 
			         
			         
														 
															