 
						

తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడమే కాకుండా, పాన్ ఇండియా ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన చిత్రం ‘బాహుబలి’. ఇప్పుడు ‘బాహుబలి’ రెండు చిత్రాలు కలిపి ‘బాహుబలి: ది ఎ’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఒక కొత్త సినిమా విడుదలైన రేంజ్ లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రిటీలు సైతం ‘బాహుబలి: ది ఎపిక్’ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వంటి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (బాహుబలి: ది ఎపిక్)
‘బాహుబలి’ బాటలో పయనించి, పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేసిన సినిమాల్లో ‘కేజీఎఫ్’ ఒకటి. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. అలాంటి నీల్, తాజాగా రాజమౌళిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక రోడ్డుకి మరమత్తులు చేయవలసి వచ్చింది. దీనితో ఓ కాంట్రాక్టర్ ని పిలిచారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డుని ఫిక్స్ చేయడమే కాకుండా.. ఏకంగా దాన్ని 16 లైన్లలో సూపర్ ఎక్స్ ప్రెస్ హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా. ఆ కాంట్రాక్టర్ ఎవరో కాదు.. రాజమౌళి. ఒక తరం కోసం కలలు కన్న బాహుబలి టీమ్ కి అభినందనలు” అంటూ ప్రశాంత్ నీల్కొచ్చారు. ప్రశాంత్ నీల్ మాటలను ఆయన సతీమణి లిఖిత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
కాగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం ఈ యాక్షన్ ఫిల్మ్.. షూటింగ్ దశలో ఉంది.
ఇది కూడా చదవండి: మహేష్ తో సందీప్ రెడ్డి మూవీ.. స్పిరిట్ సంగతేంటి..?

 	CEO
Mslive 99news
Cell : 9963185599
 
			         
			         
														 
															