 
						

-చిరంజీవి నుంచి వచ్చిన హామీ 
-ఏక్తా దివాస్ ముఖ్య అతిధిగా చిరు 
-సజ్జనార్ తో చిరంజీవి  
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావడానికి ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)తో వడివడిగా ముస్తాబవుతున్నాడు. గత చిత్రం భోళాశంకర్ పరాజయం చెందడంతో పాటు రెండున్నర సంవత్సరాల తర్వాత వస్తున్న దృశ్యం, ఆ విషయాలన్నింటిని మరుగున పడేలా పట్టుదలతో చిరు తన కొత్త గా రెడీ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో హై రేంజ్ లో ఉంది.
చిరంజీవి రీసెంట్ గా తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ‘ఏక్తా దివస్'(ektha Divas)కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు సెలబ్రిటీస్ డీప్ ఫేక్ వంటి సైబర్ నేరం బారిన పడుతున్నారు. ఈ పరీక్ష తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాను. డీజీపీ సజ్జనార్ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన పని లేదు. వీటిపై త్వరలోనే ఒక చట్టం తీసుకొస్తున్నారు. వీటి నుంచి సామాన్యులకి కూడా రక్షణ కలగడంతో పాటు, ఆ విషయంలో భయపడాల్సిన పని కూడా లేదు. పోలీసులు చాలా ఫ్రెండ్లీ గానే ఉన్నారు. టెక్నాలజీ ని మంచికి ఉపయోగించుకోవాలని చిరంజీవి తెలపడం జరిగింది.
ఇది కూడా చదవండి: ఓజి vs సంక్రాంతికి వస్తున్నాం.. ఎవరిది పై చేయి
ఇక చిరంజీవి కూడా డీప్ ఫేక్ బారిన పడటం జరిగింది. సైబర్ కేటుగాళ్లు ఏఐ(AI)సాయంతో చిరంజీవి ఫోటోలని, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.దీంతో చిరంజీవి తీవ్ర మనోవేదనకు గురై సజ్జనార్ కి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు ప్రకారం ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుంది.

 
			         
			         
														 
															