 
						

-తేజస్విని పిక్స్ వైరల్ 
-బాలకృష్ణ చిన్న కూతురు హంగామా 
-అఖండ 2 పై భారీ అంచనాలు 
-సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ యాడ్ లో తేజస్విని 
గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ ‘బాలకృష్ణ'(బాలకృష్ణ)డిసెంబర్ 5న ‘అఖండ 2′(అఖండ 2)తో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై గర్జించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు ఇటీవల రెండో క్యారక్టర్ పరిచయానికి సంబంధించి రిలీజ్ చేసిన టీజర్ తో మూవీ సూపర్ డూపర్ హిట్ అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇక ఈ చిత్రంతో నిర్మాతగా బాలకృష్ణ చిన్నకూతురు తేజశ్వని సినీ రంగ ప్రవేశం చేస్తుంది. మొదటి చిత్రమైనా ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా, 14 రీల్స్ తో కలిసి అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది.
రీసెంట్ గా తేజస్విని(తేజెస్విని)ఒక యాడ్ లో నటించి అందర్ని మెస్మరైజ్ చేసింది. ప్రముఖ జ్యూవెలరీ కంపెనీ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ రూపొందించిన యాడ్ లో తేజస్విని అద్భుతంగా నటించింది. తేజస్విని పెర్ ఫార్మెన్స్ ,గ్లామర్, యాక్టింగ్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. పస్ట్ యాడ్ లోనే ఎంతో అందంగా నటించారంటూ సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ యాడ్ కి వై యమునా కిషోర్ దర్శకత్వం వహించగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందాల మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు.
ఇది కూడా చదవండి: భయపడాల్సిన పని లేదు.. నేను విన్నాను, చెప్పాను
థమన్ ఇచ్చిన మ్యూజిక్ యాడ్ కి మరింత వెలుగునిచ్చింది. ఆయంక బోస్ ఫొటోగ్రఫీ కాగా, అవినాష్ కొల్లా కళా దర్శకత్వం, నవీన్ నూలి స్పష్టమైన ఎడిటింగ్ కూర్పును మెరుగుపరిచారు. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, నందమూరి తేజస్విని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న తేజస్విని యాడ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. పదహారు సెకన్ల నిడివితో యాడ్ రూపొందించబడింది.

 	CEO
Mslive 99news
Cell : 9963185599
 
			         
			         
														 
															