 
						

– వరుస ఫ్లాప్స్ లో రవితేజ
– మాస్ జాతర పైనే ఆశలన్నీ
– బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?
– రవితేజ హిట్ కల నెరవేరుతుందా?
ఒక మంచి హిట్ కోసం ఎంతగానో కనిపిస్తున్న మాస్ మహారాజా రవితేజ (రవితేజ).. ఇప్పుడు ‘మాస్ జాతర’తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ విషయంలో సేఫ్ గేమ్ ఆడినట్లు అర్థమవుతోంది. (సామూహిక జాతర)
2018 నుంచి ఈ ఏడేళ్లలో రవితేజ హీరోగా నటించిన 12 సినిమాలు విడుదల కాగా.. అందులో ‘క్రాక్’, ‘ధమాకా’ మాత్రమే విజయం సాధించాయి. వరుస ఫ్లాప్ ల నేపథ్యంలో రవితేజ ఆలోచనలో పడ్డాడు. అందుకే తనకి బాగా అచ్చొచ్చిన, గతంలో ఎన్నో విజయాలను అందించిన ‘యాక్షన్ కామెడీ’ జానర్ ను నమ్ముకొని ‘మాస్ జాతర’ చేశాడు. ఈ మూవీ అక్టోబర్ 31 సాయంత్రం నుండి థియేటర్లలో సందడి చేయనుంది.
ఇది కూడా చదవండి: బోయపాటి శ్రీను హిట్స్ & ఫ్లాప్స్.. ఆ ఒక్క సినిమా..?
రవితేజ ప్రస్తుత రికార్డుని దృష్టిలో పెట్టుకొని.. ‘మాస్ జాతర’ బిజినెస్ విషయంలో మేకర్స్ రిస్క్ చేయలేదని తెలుస్తోంది. థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల లోపే జరిగినట్లు సమాచారం. నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.7.5 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.15.5 కోట్ల బిజినెస్ చేసిందట. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, ఓవర్సీస్ రూ.2 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. అంటే హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.20 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.
గత కొన్నేళ్ళుగా రవితేజ మెజారిటీ సినిమాలు 20 కోట్లకు అటూఇటూగా థియేట్రికల్ బిజినెస్ చేశాయి. 30 కోట్లకు పైగా బిజినెస్ చేసిన టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ సినిమాలు మాత్రం భారీ నష్టాలను మిగిల్చాయి. రవితేజ స్టార్డమ్ కి 20 కోట్ల బిజినెస్ అనేది సేఫ్ గేమ్ అని చెప్పవచ్చు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మరి ‘మాస్ జాతర’ అదే బాటలో పయనించి.. రవితేజ ప్రస్తుతం విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
 
			         
			         
														 
															