
– కాంతార చాప్టర్ 1 కలెక్షన్స్
– కాంతార చాప్టర్ 1 ఓటిటి డేట్
– రిషబ్ శెట్టి విశ్వరూపం
అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళల్లో రిషబ్ శెట్టి(రిషబ్ శెట్టి)కి ప్రధమ చిత్రాలను కట్టబెట్టవచ్చు. కాంతార తో అదే విధంగా వచ్చి కలెక్షన్ రికార్డులు సృష్టించి, ఇప్పుడు కాంతార చాప్టర్ 1(కాంతార అధ్యాయం 1)తో తగ్గేదెలే అనే రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ నెల 2 న థియేటర్లలో అడుగుపెట్టిన చాప్టర్ 1 ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో ఆ స్థాయి కలెక్షన్లు 13వ చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు ఈ మూవీ టీం ఓటిటి సినీప్రేమికులకి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(అమెజాన్ ప్రైమ్ వీడియో)వేదికగా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్స్ లో సంచలన విజయాన్ని అందుకున్న చాప్టర్ 1 ఓటిటిలో కూడా రికార్డు స్థాయిలో సంచలన విజయం సాధించడం పక్కా అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది.
ఇది కూడా చదవండి: బాహుబలి లాంటి సినిమాని బాలీవుడ్ తెరకెక్కించగలదా!
ఇక ఈ చిత్రంలో రిషబ్ శెట్టి పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బెర్మే అనే రోల్ తో పాటు శివుడు ఆవహించిన క్యారక్టర్ లో వీరవిహారం చేసాడు. రిషబ్ శెట్టి దర్శకత్వం కూడా కట్టిపడేస్తుంది. ప్రిన్సెస్ కనకవతి గా చేసిన రుక్మిణి వసంత్(రుక్మిణి వసంత్)క్యారక్టర్ లోని డైవర్షన్ కూడా సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తుంది. జయరాం, గుల్షన్ దేవయ్య కూడా తమ పాత్రలతో మెస్మరైజ్ చేసారు.

CEO
Mslive 99news
Cell : 9963185599
