వేంసూర్ :మండల వ్యాప్తంగా ఉన్న బీసీ ఉపకుల సంఘాల ప్రతినిధులు సభ్యులు, ప్రజలందరూ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పరచాలని రేపు అనగా(18/10/2025.) న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, సంఘటిత అసంఘటిత కార్మికులు, విద్యార్థులు, యువజనులు, సమిష్టిగా బంధు నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ ఉపకుల సంఘాలు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, జెండాలతో (పట్టుకొని ) బందులో పాల్గొని జయప్రదం చేయాలని నూనె హరిబాబు యాదవ్ అన్నారు.ఈ సందర్భంగా మండలంలో ఉన్న వ్యాపారస్తులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆఫీసులు, అన్ని రంగాల బ్యాంకులు, హోటల్ యజమానులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు , రంగాలు అన్ని రేపు జరగబోవు తెలంగాణ రాష్ట్ర బందుకు సహకరించి, పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.


CEO
Mslive 99news
Cell : 9963185599
