
సుదీర్ఘ కాలం నుంచి పాన్ ఇండియా యాక్టర్ గా తన సత్తా చాటుతూ వస్తున్నాడు ‘సోనుసూద్'(సోను సూద్). అంతే స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా అభిమానులని కూడా సంపాదించాడు. సేవా గుణంలో కూడా ముందుండే సోనుసూద్ రీసెంట్ గా ముంబై లోని పన్వేల్ లో 777 చదరపు గజాల భూమిని కొనుగోలు చేసాడు. ఈ ల్యాండ్ విలువ స్టాంప్ డ్యూటీ లతో కలుపుకొని మొత్తం 1 .09 కోట్లుగా తెలుస్తుంది.
పన్వేల్(Panvel)ప్రాంతం ముంబై(ముంబై)నుంచి పూణే(పుణె)మార్గంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి బడా కంపెనీలు లేకపోయినా త్వరలోనే ఐటి ప్రాజెక్ట్స్, విద్యాసంస్థలు రాబోతున్నాయంట. అందుకే సోనుసూద్ ప్లాట్ ని కొనుగోలు చేసినట్లు టాక్. సోను సూద్ కొన్ని రోజుల క్రితం ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన ఫ్లాట్ ని అమ్మి రెండున్నర కోట్ల రూపాయల లాభాలు పొందాడు. ఆ తర్వాత తన కొడుకు పేరుపై ముంబై లోనే ఖరీదైన ప్లాట్ ని కొన్నాడు. ఇలా తక్కువ వ్యవధిలోనే స్థిరచరాస్తులకి సంబంధించి సోనుసూద్ క్రయ, విక్రయాలు చేయడంతో, సంబంధిత వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ పరంగా చూసుకుంటే సోను సూద్ ఈ ఏడాది జనవరిలో ‘ఫతే’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోతో పాటు నిర్మాతగా వ్యవహరించిన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని అందుకుంది.

CEO
Mslive 99news
Cell : 9963185599
