
పెనుబల్లి, సెప్టెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మండలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు,జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.వీయం బంజర్ సెంటర్ లో కేక్ కత్తిరించి స్వీట్స్ పంపిణీ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.అనంతరం ఎడ్ల బంజర గ్రామంలో బాణాసంచా కాల్చి, కేక్ కత్తిరించి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ యాకుబ్ పాషా,కంటే సాయి,వంగా సుభాష్ గౌడ్,రామిశెట్టి తేజ, మరీదు గణేష్,గరిడేపల్లి శివ,కేతేపల్లి సాయి,శివ తదితరులు పాల్గొన్నారు.







CEO
Mslive 99news
Cell : 9963185599