ఇటీవల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయితే ఈ కష్టకాలంలో ఒక వ్యక్తి చూపిన సామాజిక బాధ్యతా స్పూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
👉 కల్లూరు పరిధిలోని ఖాన్ ఖాన్ పేట గ్రామం నాగార్జునసాగర్ కెనాల్ బ్రిడ్జిపై మట్టి, ప్లాస్టిక్ బాటిల్స్, మద్యపు సీసాలు పేరుకుపోయాయి. బ్రిడ్జి మీద నీరు పోయే రంధ్రాలు మూసుకుపోవడంతో వరదనీరు నిలిచి, ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, చిన్న వాహనాల్లో ప్రయాణించే వారు, పాదచారులు ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు.📌 ఈ సమస్యను గమనించినప్పటికీ, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించలేదు.
📌 గ్రామ పంచాయతీ సిబ్బంది సహాయం కోరినా “వాహనం పనికిరాదు” అంటూ తప్పించుకున్నారు.కానీ ఈ సమయంలో –
👉 “ఇది నా పని కాదు” అని వెనక్కి తగ్గకుండా
👉 “ప్రజల ఇబ్బందులు మనవే” అని భావిస్తూ
కర్నాటి అప్పిరెడ్డి ముందుకు వచ్చారు. రెడ్డి మెడికల్స్ నిర్వహిస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల సమస్యలను ఎప్పుడూ ముందుంచే ఆయన,ఈ సారి కూడా తానొక సాధారణ యువకుడిలా బ్రిడ్జిపై చెత్తను శుభ్రం చేశారు.భారీ వర్షంలో మూడు గంటల పాటు శ్రమించి, మట్టి, పిచ్చిమొక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మూడు రంధ్రాలను సాఫీగా చేసి, నిలిచిపోయిన నీరు కింద కాల్వల్లోకి వెళ్లేలా చేశారు.ఈ సేవా కార్యక్రమంలో పాస్టర్ మోజేష్ కూడా ఆయనతో కలసి పనిచేశారు.అధికారులు, సిబ్బంది స్పందించని సమయంలో –
“ఎవరు చేస్తారో చూద్దాం” అనే ధోరణి కాకుండా”మనమే ముందుకు వస్తే పనవుతుంది” అనే దృక్పథం చూపించారు అప్పిరెడ్డి.రూపాయి లాభం కోసం కాదు – సమాజ సేవే తన లక్ష్యం అని నిరూపించారు.ఈ సంఘటనతో కల్లూరు మున్సిపాలిటీ ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు.
📢 వైద్యరంగంలో సేవలందిస్తూనే,
📢 రాజకీయాల్లో ప్రజల కోసం పోరాడుతూనే,
📢 సామాజిక సమస్యలను స్వయంగా పరిష్కరించే ఈ తపన – నిజమైన నాయకత్వానికి నిదర్శనం.






CEO
Mslive 99news
Cell : 9963185599