
- 2.40 లక్షలతో ఉచిత చేతి పంపులు ప్రారంభించిన సీడిఏ కార్యదర్శి ఏనోష్ కుమార్
వైరా:మండల కేంద్రము లో పెద్దరామపురం, పల్లి పాడు, గండుగులపాడు గ్రామంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన మంచినీటి చేతిపంపులను సోమవారం సిడిఏ కార్యదర్శి,ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలియజేయటంతో ప్రజలు త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన వెంటనే స్పందించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ద్వారా సుమారు 2 లక్షల 40 వేల రూపాయల విలువగల ఉచిత చేతిపంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.మారుమూల ప్రాంతాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకుగాను వారు చేసిన సహాయమును బట్టి గ్రామంలో చేతిపంపులను ఏర్పాటు చేయగ గ్రామస్తులు,నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని పూల మాలలతో ,శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు,కల్లూరు మండల అధ్యక్షులు రెవరెండ్ తెళ్ళ ఎబినేజర్, ప్రధాన కార్యదర్శి జాన్ పరంజ్యోతి,ఏఐసిసి నాయకులు నాచుముత్తి సుందర్ రాజు,పాస్టర్ మేడి మేషక్,పౌలు పలువురు పాల్గొన్నారు





CEO
Mslive 99news
Cell : 9963185599
