
సత్తుపల్లి : ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన రోజు సందర్భంగా మల్లికార్జున ఖర్గేకు జన్మదిన శుభాకాంక్షలు,నిర్విరామ సేవ,మీకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు,జాతీయ బిసి సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు శివా వేణు, సత్తుపల్లి పట్టణం, మండలం కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..



- CEO
Mslive 99news
Cell : 9963185599