మహిళల స్వయం ఉపాధి ప్రధాన లక్ష్యం : సి డి ఎ చైర్మన్ పి ఏనోశ్ కుమార్
ఖమ్మం జూలై 20: నిరుపేద మహిళలు స్వయం ఉపాధి పొంది ఆత్మగౌరవంతో జీవించు లాగున వారిని ప్రోత్సహించడమే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్, ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఏనోశ్ కుమార్ అన్నారు. ఆదివారం యూపీహెచ్ కాలనీ ఖానాపురంలో ఆయన ఉచిత కుట్టు మిషన్ తర్ఫీదు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందడానికి ఆరు నెలలపాటు వారికి కుట్టు మిషన్ ట్రైనింగ్ ను నైపుణ్యం కలిగిన అధ్యాపకులచే ఉచితంగా ఇప్పించి, వారి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్లు కూడా ఉచితంగా అందించి వారు ఆత్మగౌరవంతో ఆర్థిక స్వతంత్రం కలిగి జీవించే లాగా ప్రోత్సహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
CEO
Mslive 99news
Cell : 9963185599




CEO
Mslive 99news
Cell : 9963185599