


ఖమ్మం : నగరంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ యువనేత డాక్టర్ తుమ్మల యుగంధర్ ఉదయాన్నే గాంధీచౌక్ లోని గాంధీ విగ్రహం వద్ద వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు .అనంతరం మంత్రి తుమ్మల క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు వివిధ సమస్యలను తెలుసుకొని అనంతరం వాటిని సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అనంతరం నగరంలోని పలు విద్యుత్ సరఫరా లో అంతరాయం ,అలాగే డివిజన్ ప్రాంతాల్లో వర్షకాలంలో తీసుకోవలసిన చర్యలను ఇల్లందు క్రాస్ రోడ్డులో ఉన్న విద్యుత్ సూపరిండెంట్ ఇంజినీర్ ను కలసి పలు సమస్యలపై చర్చించారు అటు తరువాత,37,38,40 డివిజన్ లోని ప్రభుత్వ పాఠశాలలో తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ఉచితంగా స్కూలు బ్యాగులను అందించారు, అనంతరం 44 వ డివిజన్ ముఖ్య నాయకు గుడిపూడి జగదీశ్ జన్మదిన సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో అశ్రిఫ్ ,నాళం సతీష్ , డిప్యూటీ మేయర్ ముక్తార్, కార్పొరేటర్ శౌకత్, అల్సాద్, తుపాకుల శ్రీను, బొమ్మా ఉదయ్,కుక్కల మహేష్, బాణాల లక్ష్మణ్,శ్రీధర్, నరేష్ నాయుడు, సమీర్, అజీము, ఆహద్, అబ్బాస్, జావేద్,ఆనంద్,నవాజ్, ముక్రం, కైసర్, ఆసిఫ్, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

- CEO
Mslive 99news
Cell : 9963185599