
🔷 పెండింగ్ బిల్లుల చెల్లింపునకు డీప్యూటీ సీఎం హామీ
🔶శీఘ్రగతిన పూర్తి చేయించాలని ఎమ్మెల్యేకి ఆదేశం
🔷మంత్రి భట్టి సానుకూల స్పందనతో గన్నేరువరం నేతల్లో ఆనందం
గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి పొత్తూరు మార్గంలో డబుల్ రోడ్డ్ పనుల నిలిపివేతకు కారణమైన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నేతృత్యంలో గన్నేరువరం మండల కాంగ్రెస్ నాయకులతో సోమవారం హైదరాబాద్ లోని సచివాలయంలో భట్టిని కలిసినప్పుడు ఈ మేరకు ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.రూ.71 కోట్లలో చేపట్టిన గుండ్లపల్లి-పొత్తూరు మార్గంలో చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేయడంతో రోడ్డు పనులు అర్థంతరంగా నిలిచిపోయాయని, దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, మరీ ముఖ్యంగా వర్షాకాలంలో మరింత అవస్థలు పడాల్సి వస్తున్నదని వారు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. ముందుగా కాంట్రాక్టర్ కు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని వారు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క పెండింగ్ బిల్లుల విషయమై శాఖ అధికారులతో మాట్లాడి ఆ బిల్లుల చెల్లింపులు చేపట్టేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.ఈ విషయంలో ప్రతి పక్షాల అనవసర ఆందోళనలతో ఆ ప్రాంత ప్రజలు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బిల్లుల చెల్లింపులు చేపడుతున్నందున పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎమ్మల్యే డాక్టర్ కవ్వంపల్లిని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తో పాటు కాంట్రాక్టర్ కమాలొద్దీన్, గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, చిట్కారి ఆనంద్ రెడ్డి, అలువాల కోటి, జువ్వాడి మన్మోహన్ రావు, చింతల శ్రీధర్ రెడ్డి, బొడ్డు సునిల్, సంగు వేణు, బద్దం సంపత్ రెడ్డి, దుండు మల్లేశం, చింతలపల్లి నర్సింహారెడ్డి, బూర వెంకటేశ్, మాతంగి అనిల్, వరుకోలు వెంకట్, డాక్టర్ నర్సయ్య, తిరుపతిగౌడ్ తదితరులు ఉన్నారు.




- CEO
Mslive 99news
Cell : 9963185599