- కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన శ్రీనివాసరావు
కల్లూరు : వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద బోయిన శ్రీనివాసరావు అన్నారు.రైతు భరోసా కింద తొమ్మిది నెలల్లో 9వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి సుమారు 75లక్షల మంది రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.సత్తుపల్లి నియోజకవర్గం లో సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, వారికి సహాకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్ర పటాలకు ప్రతి గ్రామంలో పాలాభిషేకం చేయాలని కాంగ్రెస్ నాయకులకు పెద్ద బోయిన శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు.


CEO
Mslive 99news
Cell : 9963185599
