- కేక్ కత్తిరించి శుభాకాంక్షలు తెలిపిన ఏయంసీ ఛైర్మన్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
కల్లూరు: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కల్లూరు లో ఘనంగా నిర్వహించారు.కల్లూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆళ్ళకుంట నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏయంసీ ఛైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి స్విట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏయంసీ ఛైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు జరిగేలా ప్రణాళిక చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిచే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




CEO
Mslive 99news
Cell : 9963185599
