కల్లూరు జూన్ 6 : మండల పరిధిలోని లింగాల గ్రామానికి చెందిన వేపూరి హరీష్ ఇటీవల నూతనంగా ప్రారంభించిన మనోరమ ఈవెంట్స్ పోస్టర్ ను డీ పీ ఆర్ ట్రస్ట్ ఛైర్మన్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవరపల్లి పట్టాభిరామ్ ఆయన నివాసంలో ఈ పోస్టర్ను అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మనోరమ హరీష్ మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ,జన్మదిన వేడుకలు, వివాహ వార్షికోత్సవ వేడుకలు ,గ్రామీణ ప్రాంత ప్రజల కోసం అధునాతనంగా నిర్వహించడానికి ఈ మనోరమ ఈవెంట్స్ ను ప్రారంభించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పెడకంటి రామకృష్ణ ,కొరకొప్పు ప్రసాద్ ,బోబోలు లక్ష్మణరావు ,శీలంశెట్టి కిరణ్ ,కళ్యాణ్ కిషోర్, మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


CEO
Mslive 99news
Cell : 9963185599
