కల్లూరు: మండల పరిధిలోని యర్రబోయినపల్లి రేషన్ దుకాణం నెంబర్ 2 డీలర్ సింగిశాల ప్రసాద్ రేషన్ దుకాణం లో పరిమితికి మించి అదనంగా స్టాక్ ఉందని కల్లూరు పోలిస్ స్టేషన్లో బుధవారం అందిన సమాచారం మేరకు బుధవారం రాత్రి యస్ ఐ హరిత తనిఖీ నిమిత్తం దుకాణానికి తాళం వేశారు.అనంతరం మరునాడు ఉదయం సివిల్ సప్లై డిటి సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ ఏయస్ ఐ జి.క్రిష్ణ, యస్ ఐ హరిత తనిఖీ చేశారు.ఈ నేపథ్యంలో 75 కేజీల స్టాక్ తక్కువ వ్యత్యాసం ఉన్నట్లు నిర్ధారించి, రేషన్ దుకాణం చెన్నూరు డీలర్ కె.అమల కి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినట్లు సివిల్ సప్లైఅధికారులు తెలిపారు.అనంతరం రేషన్ డీలర్ సింగిశాల ప్రసాద్ పై 6a కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం ఆర్డీవో, జేసీ కి నివేదిక అందించనున్నట్లు అధికారులు తెలిపారు.





- CEO
Mslive 99news
Cell : 9963185599