- మీనాక్షి నటరాజన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నున్నా రామకృష్ణ
- కాంగ్రెస్ పార్టీ తో ఉన్న అనుబందాన్ని తెలిపిన నున్నా
- పార్టీ లో సముచిత స్ధానంకోసం నున్నా ఎదురుచూపు
- మీనాక్షి నటరాజన్ సానుకూల స్పందన పై నున్నా హర్షం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కాంగ్రెస్ పార్టీ తెలంగాణా వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల పర్యటన లో భాగంగా కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ముందుగా కిన్నెరసాని లో గిరిజన గురుకుల పాఠశాలలో మంత్రి పొంగులేటి తో కలిసి శ్రమాధానం చేసారు. అనంతరం ఆదివాసీల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులకు గొప్ప అవకాశం లభించినట్లయింది. ఈ సందర్బంగా సత్తుపల్లి నియోజకవర్గం కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నున్నా రామకృష్ణ మర్యాద పూర్వకంగా మీనాక్షి నటరాజన్ ని కలిసి ఆయనకి కాంగ్రెస్ తోగత నలబై ఏళ్లగా ఉన్న అనుబంధాన్ని వివరించారు. కాంగ్రెస్ పార్టీ పధకాలపై ప్రజల స్పందన బావుందని వివరించారు. పార్టీ బలోపేతం చేయడానికి పలు సూచనలు చేసినట్లు, దానితో పాటు పార్టీని నమ్ముకొని ఉన్న వారికీ సరైన గుర్తింపు ఇస్తే భవిష్యత్తు లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పినట్లు సమాచారం.ఈ విషయం పై మీనాక్షి నటరాజన్ సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి ఇంచార్జి మన కాంగ్రెస్ పార్టీ కి ఉండటం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గర్వపడే విషయం అని నున్నా రామకృష్ణ తన అభిప్రాయం తెలిపారు.




- CEO
Mslive 99news
Cell : 9963185599