లబ్దిదారులకు 750 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

కల్లూరు: ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు పంపిణీ కార్యక్రమం నూతన షాధీకానా ఆవరణలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే మట్టా రాగమయి కి ఇళ్ళ లబ్దిదారులు దారిపొడవునా పూలతో ,మేళ తాళాలు తో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో పేదలకు ఇండ్లు మంజూరు చేయలేదని, నామ మాత్రంగా ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నివాసానికి ఉపయోగంగా లేవని ,సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని ,వర్షం వస్తే ఇండ్లు కురుస్తున్నాయని కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందులో భాగంగా సత్తుపల్లి నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయని, కల్లూరు మండలానికి 756 ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటదని, ప్రతి పేదవాడి కూడా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని, బిల్లులు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు .దళారులను నమ్మి మోసపోవద్దని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం అందుతుందని అన్నారు. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు .నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపి నా బాధ్యత నెరవేరుస్తానని అన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు ముఖేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సొంత ఇంటి కాల నెరవేర్చిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర గౌడ్, తాసిల్దార్ పులి సాంబశివుడు, ఏం సి చైర్మన్ భాగం నీరజా దేవి ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు, లక్కినేని కృష్ణ, యూత్ అధ్యక్షులు ఆళ్లకుంట నరసింహారావు,బత్తుల రాము, పోట్రు అర్జున్ రావు,తక్కెళ్లపాటి దుర్గాప్రసాద్ మట్ట రామకృష్ణ, బొల్లె పోగు రవి , మైనార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



- CEO
Mslive 99news
Cell : 9963185599