
కల్లూరు: బీఆర్ యస్ యంయల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలను కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన శ్రీనివాసరావు ఖండించారు.సత్తుపల్లి నియోజకవర్గం లో అకాల వర్షాలు వచ్చి రైతులు ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారు అని అన్నారు.మీ నాయకుడు సండ్ర చేసిన హడావుడి కి మిల్లర్లు భయపడే పరిస్థితి వచ్చిందని అన్నారు.నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో అడిగి తెలుసుకోని మాట్లాడితే మంచిది అని కవితని, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఏనుగు సత్యంబాబు, లక్కినేని క్రిష్ణ, పసుమర్తి చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.


CEO
Mslive 99news
Cell : 9963185599
