
కల్లూరు: మండల పరిధిలోని లింగాల గ్రామంలో గృహప్రవేశానికి హాజరైన బిఆర్ యస్ యంయల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై, ఖమ్మం జిల్లాకి చెందిన ముగ్గురు మంత్రులపై విమర్శలు చేశారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్లూరు ఏయంసీ ఛైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి స్పందించారు.తైతక్కా ఈ పదేళ్ళలో మీరు చేసింది ఎంటని ప్రశ్నించారు.కేసీఆర్ ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.మీరు పదేళ్ళలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేక పోగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేస్తున్నారని భాగం నీరజ ప్రభాకర్ చౌదరి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఏనుగు సత్యంబాబు,లక్కినేని క్రిష్ణ, తక్కెళ్ళపాటి ధుర్గాప్రసాద్, పెద్ద బోయిన శ్రీనివాసరావు, పసుమర్తి చందర్ రావు,దామాల రాజు,కేవీఆర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు


- CEO
Mslive 99news
Cell : 9963185599