
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు పరాభావం తప్పదు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కేటీఆర్ కథ క్లైమాక్స్‌కు చేరారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్యూరి వెంకట్ స్పష్టం చేశారు. నువ్వెంత గింజుకున్నా సిరిసిల్లలో నీకు ఎండ్ కార్డు వేస్తున్నామని సెటైర్లు వేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మట్లాడారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఓటర్లు బీఆర్ఎస్‌ను చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించబోతున్నారని జోస్యం చెప్పారు. సొంత నియోజకవర్గంలో కాళ్ల కింద భూమి కదిలిపోవడంతో కేటీఆర్ కుతకుత ఊడికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయ భవిష్యత్తు గల్లంతు అవుతుందన్న భయంతో సీఎం పైన నోరు పారేసుకుంటున్నాడన్నారు. అసహనంతో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అసలు నువ్వు ఎవరు..? తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎంత? అని ప్రశ్నించారు. కేకే మహేందర్ రెడ్డి లాంటి ఉద్యమకారుడి గొంతుకోసి సిరిసిల్ల సీటు సంపాదించారని. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదే ఎన్నో నీచపు పనులు చేశాడన్న బల్‌మూరి….. పాస్‌పోర్ట్ బ్రోకర్లు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. పదేళ్లు ఎవరు బ్రోకర్ పనులు, బేకారు పనులు చేశారో చిన్న పిల్లలను అడిగినా చెపుతారని.
