Home సినిమా రాజా సాబ్, జన నాయకన్ థియేటర్స్ ఇష్యూ.. నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు! – Swen Daily

రాజా సాబ్, జన నాయకన్ థియేటర్స్ ఇష్యూ.. నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు! – Swen Daily

by
0 comment
రాజా సాబ్, జన నాయకన్ థియేటర్స్ ఇష్యూ.. నిర్మాత అనిల్ సుంకర సంచలన వ్యాఖ్యలు!
2,807 Views



రాజా సాబ్ వర్సెస్ జన నాయకన్
తెలుగునాట థియేటర్స్ ఇష్యూ
రాజా సాబ్ కి అన్యాయం జరుగుతుందా?
నిర్మాత అనిల్ సుంకర ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ సంక్రాంతికి ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ ఇలా ఐదు తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అదే సమయంలో ‘జన నాయకన్’, ‘పరాశక్తి’ అనే రెండు తమిళ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి.

అయితే ‘ది రాజా సాబ్’ విడుదలవుతున్న జనవరి 9న ‘జన నాయకన్’ విడుదలవుతోంది. ఈ థియేటర్ల కేటాయింపుకి సంబంధించిన వివాదం గురించి తెలుగునాట విపరీతంగా చర్చ.

తమిళ్ లో ‘జన నాయకన్’ జనవరితో.. అక్కడ ‘రాజా సాబ్’ ఒకరోజు ఆలస్యంగా 10న విడుదలవుతుంది. కానీ, తెలుగులో ‘రాజా సాబ్’ చిత్రం, జనవరి 9న ‘జన నాయకన్’ విడుదలకు రెడీ అవుతోంది. ఇది డబ్బింగ్, పైగా తెలుగు మూవీ ‘భగవంత్ కేసరి’కి రీమేక్. అయినప్పటికీ థియేటర్లను బాగానే కేటాయిస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డబ్బింగ్ మూవీ, అందునా తెలుగు మూవీకి రీమేక్ అయిన ‘జన నాయకన్’కి అన్ని థియేటర్లు ఎలా వస్తాయంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ ఇష్యూపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు.

ఇది కూడా చదవండి: పంచతంత్రం.. ఐదుగురు స్టార్స్ తో డైరెక్టర్ మారుతి మల్టీస్టారర్!

జనవరి 14న విడుదలవుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో థియేటర్ల ఇష్యూ గురించి అనిల్ సుంకర మాట్లాడారు. “మాకు రిలీజ్ మిగిలిన సినిమాల్లా ఎక్కువ థియేటర్లు అవసరం లేదు. 23కి పైగా అందరికీ సేమ్ థియేటర్లు ఉంటాయి. సెకండ్ వీక్ ఫ్రీగానే ఉంటుంది. అయితే ‘జన నాయకన్’ రావడం చర్చనీయాంశమే. మరి వాళ్ళు మన సినిమాకి అక్కడ థియేటర్లు ఇస్తున్నారంటే ఓకే. మన సినిమా అంటే చాలా బాగుండాలి కదా. అన్నారు.

అనిల్ సుంకర చెప్పిన సరైన పాయింట్. జనాలు చూడకపోతే ఖాళీ థియేటర్స్ ని ఉంచుకోలేరు కదా. ఫస్ట్ డే థియేటర్స్ కౌంట్ ఎలా ఉన్నా.. కంటెంట్ ని బట్టి, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి.. థియేటర్ల సంఖ్య పెరగడమో తగ్గడమో జరుగుతుంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird