Home సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ రిపోర్ట్ ఏంటి..? – Swen Daily

మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ రిపోర్ట్ ఏంటి..? – Swen Daily

by
0 comment
మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ రివ్యూ.. సెన్సార్ రిపోర్ట్ ఏంటి..?
2,805 Views



ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న 2026 సంక్రాంతి సినిమాలలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ ముందు వరుసలో ఉంటుంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం అదనపు ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ‘మన శంకర వరప్రసాద్’పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. (మన శంకర వర ప్రసాద్ గారు)

తాజాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. రన్ టైంని 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.

‘మన శంకర వరప్రసాద్ గారు’ సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉంది. అనిల్ రావిపూడి శైలిలో ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందట. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. తనదైన కామెడీ టైమింగ్ తో వన్ మ్యాన్ షోలా ఈ సినిమాని నడిపించారట. చిరంజీవి, నయనతార ట్రాక్ బాగుందట. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా కామెడీతో పాటు డ్రామా కూడా బాగా పండిందని అంటున్నారు. ఇక చివరిలో వెంకటేష్ రాకతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వచ్చిందని, చిరు-వెంకీ కాంబో సీన్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని అంటున్నారు.

ఇది కూడా చదవండి: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

మొత్తానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అసలుసిసలైన పండగ సినిమాలున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టే అవకాశముందనే మాట వినిపిస్తోంది.

You may also like

Leave a Comment

MS Live 99 News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana,  is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird